TG Ration Card eKYC Status : రేషన్ కార్డ్ e-KYC పూర్తి అయిందా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Telangana Ration Card eKYC Status : తెలంగాణ రేషన్ కార్డుదారులు తమ e-KYC ప్రక్రియ పూర్తయిందో లేదో ఇంటి వద్ద నుంచే మొబైల్‌లో సులభంగా తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
Telangana Ration Card eKYC Status : తెలంగాణలో ఉచిత రేషన్ బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. పారదర్శకతను పెంచేందుకు, అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానాన్ని విధిగా చేపడుతోంది. ఈ నెలాఖరు నాటికి (జూలై 31) ప్రతి లబ్ధిదారుడు ఈ-కేవైసీ ప్రక్రియను ముగించాల్సి ఉంటుంది.

ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయని సభ్యుల పేర్లను రేషన్ కార్డుల నుంచి అధికారులు తొలగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో ఉచిత రేషన్ బియ్యం నిలిచిపోవడమే కాకుండా, రేషన్ కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రాతిపదికన ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం కోరుతోంది.
మీ రేషన్ కార్డుకు సంబంధించి ఈ-కేవైసీ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఇకపై అధికారుల చుట్టూ గానీ, రేషన్ షాపుల చుట్టూ గానీ తిరగాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారానే అత్యంత సులభంగా రేషన్ కార్డ్ e-KYC స్టేటస్‌ను నిమిషం వ్యవధిలోనే చెక్ చేసుకోవచ్చు.
మొబైల్‌లో e-KYC స్టేటస్ చెక్ చేసుకునే విధానం:
- ముందుగా మీ మొబైల్ బ్రౌజర్‌లో https://smartpds.telangana.gov.in/ అధికారిక లింక్‌పై క్లిక్ చేయాలి.
- పోర్టల్ హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత… అందులో కనిపించే Beneficiary Details పై నొక్కాలి.
- ఇక్కడ ఓపెన్ అయ్యే విండోలో మీ రేషన్ కార్డు నెంబర్ తో పాటు క్యాప్చాను నమోదు చేయాలి.
- ఇక్కడ రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో పాటు ఈకేవైసీ స్టేటస్ వివరాలు కూడా కనిపిస్తాయి.
- స్టేటస్ యాక్టివ్ అని ఉంటే ఈకేవైసీ పూర్తి అయినట్లు భావించాలి.
ఈకేవైసీ ఎక్కడ చేసుకోవాలంటే..?
లబ్ధిదారులు తమ పరిధిలోని రేషన్ దుకాణానికి వెళ్లాలి. అక్కడ ఉండే ఈ-పోస్ (e-POS) యంత్రంలో వేలిముద్ర (బయోమెట్రిక్) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీసేవా కేంద్రాల్లో కూడా ఆధార్ ధృువీకరణ ద్వారా ఈ-కేవైసీ చేసుకునే సదుపాయం ఉంది. రేషన్ కార్డుతో పాటు…. అందులో నమోదైన సభ్యులందరి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి. ఈ-కేవైసీ నమోదు ప్రక్రియ పూర్తిగా ఉచితం. దీని కోసం రేషన్ డీలర్లకు లేదా ఇతరులకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

