SIR in Andhrapradesh : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - జూన్ 15 నుంచి ఇంటింటి సర్వే..!
SIR in Andhrapradesh 2026 : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - జూన్ 15 నుంచి ఇంటింటి సర్వే..! ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) షెడ్యూల్‌ను విడుదల చేసింది. జూలై 1, 2026 అర్హత తేదీగా ఈ ప్రక్రియ సాగనుంది.
Special Intensive Revision in Andhrapradesh : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయడానికి, సరికొత్తగా అప్‌డేట్ చేయడానికి 'ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026' (Special Intensive Revision - SIR) ప్రక్రియను చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సవరణ ప్రక్రియకు జూలై 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) వివేక్ యాదవ్ వెల్లడించారు. జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు.

ఇంటింట సర్వే…
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి భారీ యంత్రాంగాన్ని రంగంలోకి దించుతున్నారు. మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (BLOs) జూన్ 15 నుంచి జూలై 14 వరకు నేరుగా ఓటర్ల ఇళ్ల వద్దకే వచ్చి సర్వే నిర్వహిస్తారు.
ఈ ఎన్యుమరేషన్ ప్రక్రియలో రాజకీయ పార్టీల తరఫున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) కూడా బీఎల్‌వోలకు సహాయకరంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించడం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం.
ఓటర్ల జాబితా సవరణ - ముఖ్యమైన తేదీలు:
- జూన్ 6 నుంచి జూన్ 14 వరకు : ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, అధికారులకు శిక్షణ అవసరమైన ఫారాల ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతుంది.
- జూన్ 15 నుండి జూలై 14 వరకు : బీఎల్‌వోల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ (Rationalisation) ప్రక్రియను కూడా జూలై 14 లోగా పూర్తి చేస్తారు.
- జూలై 2 1: సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు.
- జూలై 21 నుండి ఆగస్టు 20 వరకు: ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి, కొత్తగా ఓటు హక్కు కోసం క్లెయిమ్‌లు దాఖలు చేయడానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు.
- జూలై 21 నుండి సెప్టెంబరు 18 వరకు : వచ్చిన క్లెయిమ్‌లు, నోటీసులు మరియు అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు.
- సెప్టెంబరు 22 : అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితానుఅధికారికంగా విడుదల చేస్తారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనేది ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఎన్నికల అధికారులు అందరూ భాగస్వాములు కావాల్సిన ఒక కీలకమైన ప్రక్రియ అని సీఈవో వివేక్ యాదవ్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా మరియు లోపాలు లేకుండా జరగాలనేదే ఎన్నికల సంఘం లక్ష్యమని ఆయన వివరించారు. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో తమ బూత్ స్థాయి ఏజెంట్లను (BLAs) తప్పనిసరిగా నియమించాలని…. ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివేక్ యాదవ్ కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

