TTD Ghee Case : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో హవాలా మనీ.. ఎంట్రీ ఇచ్చిన ఈడీ!

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి నెలకొంది.

Published on: Feb 10, 2026, 12:29:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో భారీగా ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టుగా సిట్ విచారణలో తేలింది. దీంతో పీఎంఎల్ (Prevention of Money Laundering Act) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. హవాలా మనీ కోణం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో డబ్బులు చేతులు మారడంపై ఈడీ విచారణ చేయనుంది. మనీ ట్రయల్‌పైనా ఈడీ అధికారులు ఫోకస్ చేస్తారు.

తిరుమల శ్రీవారి లడ్డూ
తిరుమల శ్రీవారి లడ్డూ

ప్రత్యేక దర్యాప్తు బృందం అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం.. ఈ కేసు హవాలా ఆధారిత నగదు లావాదేవీలు, ప్రైవేట్ పాల సంస్థలు, మధ్యవర్తులు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులకు నెయ్యి టెండర్లు, అనుమతులను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు చెల్లించడం చుట్టూ నడుస్తోంది. హవాలా ఆపరేటర్ల ద్వారా తక్కువ మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు వెల్లడైంది.

పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేయడానికి వివిధ డెయిరీల డైరెక్టర్లు, టీటీడీ అధికారుల మధ్య నేరపూరిత కుట్ర జరిగిందని సిట్ ఆరోపించింది. అనర్హమైన డెయిరీలు నకిలీ పత్రాలను సమర్పించి, తక్కువ ధరలను కోట్ చేయడం ద్వారా టెండర్లను పొందాయని ఆరోపణలు ఉన్నాయి.

సిట్ ప్రకారం.. ప్రధానంగా భోలే బాబా ఆర్గానిక్ డెయిరీకి చెందిన పోమిల్ జైన్(A-3), విపిన్ జైన్ (A-4) లంచాలు చెల్లించారు. కమిషన్ ఏజెంట్ల ద్వారా నిధులు మళ్లించారు. ఢిల్లీ హవాలా దుకాణాల నుండి విజయవాడ (భరత్ భాయ్ ఠాకూర్), చెన్నై (మదారం దేవాసి), హైదరాబాద్ (అర్జున్ గోస్వామి) ఏజెంట్లకు టోకెన్ ఆధారిత కరెన్సీ వెరిఫికేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి నిధులను తరలించే హవాలా నెట్‌వర్క్ ఉన్నాయని ఛార్జిషీట్ పేర్కొంది.

59,71,781 కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారని, రూ.234.51 కోట్లు దుర్వినియోగం చేసినట్టుగా సిట్ వెల్లడించింది. పోమిల్ జైన్ విలాసవంతమైన ఇంటిని నిర్మించడం, వాణిజ్య ప్లాట్లను కొనుగోలు చేయడం కూడా ఇందులో సిట్ పేర్కొంది. కల్తీపై నెయ్యి ఎక్కువగా కూరగాయల కొవ్వు ఆధారితమైనదని ఛార్జిషీట్ పేర్కొంది. జంతు కొవ్వులను గుర్తించలేదని పేర్కొంది.

నెయ్యి కల్తీ వ్యవహారంలో ఛార్జ్‌షీట్‌లో 36 మందిని నిందితులుగా చేర్చింది సిట్. అందులో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. టెండర్లలో అక్రమాలు, హవాలా మార్గాల ద్వారా లంచాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా విచారణలో తేలింది. దీంతో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపుపై ఈడీ విచారణ చేయనుంది. త్వరలోనే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More