EHS : ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌పై కీలక అప్డేట్.. రీయింబర్స్‌మెంట్‌కు పేపర్‌లెస్ సిస్టమ్

Employees Health Scheme : ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కొత్త విధానం అమలులోకి రానుంది.

Published on: Mar 23, 2026, 22:43:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) కింద మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఒక డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆరోగ్యం, వైద్య విద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ విధానం ద్వారా బిల్లుల ప్రక్రియ మరింత సరళంగా మారి, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆ శాఖ విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన తెలిపింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రకటన ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్(APCFSS) ద్వారా ఒక కొత్త సాఫ్ట్‌వేర్ రూపొందిస్తోంది. ఈ కొత్త పేపర్‌లెస్ విధానం కింద, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్స పొందిన ఆసుపత్రుల నుండి వైద్య బిల్లులు నేరుగా డాక్టర్ ఎన్.టి.ఆర్. వైద్య సేవ ట్రస్ట్‌కు పంపిస్తారు. ఈ ప్రక్రియ కోసం ఆసుపత్రులకు ప్రత్యేక లాగిన్ సదుపాయం కల్పిస్తారు. చెల్లింపుల విషయంలో తాము పూర్తి సహకారం అందిస్తామని ఆసుపత్రి యాజమాన్యాలు హామీ ఇచ్చినట్లు ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేపర్‌లెస్ బిల్లుల చెల్లింపుల విధానాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆసుపత్రుల నమోదు, సంబంధిత ప్రక్రియలను ఏప్రిల్ 30 నాటికి పూర్తి చేయాలనే ప్రాథమిక లక్ష్యంతో ఈ సంస్కరణలను త్వరలోనే అమలు చేయడానికి ఆ శాఖాధికారులు కృషి చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 5,55,988 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2,32,764 మంది పెన్షనర్లు ఉన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు వస్తారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో అనేక దశలతో కూడిన సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సి వస్తోంది. దీనివల్ల జాప్యం, అసౌకర్యం కలుగుతున్నాయి. కొత్త డిజిటల్ విధానంతో పనులు త్వరగా అవుతాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More