Telangana Govt : మహిళా సంఘాలకు ఆరోగ్య భరోసా - ఉచితంగా 30 రకాల పరీక్షలు..!

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వం  హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది.  ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ కింద సుమారు 46 లక్షల మంది మహిళలకు సంబంధించి సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని సేకరించనుంది. వారికి అవసరమైన వైద్య సహాయం అందించనుంది.

Published on: Mar 12, 2026, 06:53:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మార్చి 8వ తేదీన ప్రారంభించింది.

డ్వాక్రా మహిళలకు ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్
డ్వాక్రా మహిళలకు ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్

ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ - ముఖ్యాంశాలు:

  • రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం కోసం ఈ ప్రణాళికను రూపొందించింది. నాన్-కమ్యూనికబుల్ వ్యాధులను ముందుగానే గుర్తించి…. మెరుగైన వైద్యం అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
  • రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని 542 మండలాల పరిధిలో ఉన్న సుమారు 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో మహిళకు రక్తహీనత (అనీమియా), మధుమేహం, బీపీ, థైరాయిడ్, కాలేయం, కిడ్నీ పనితీరు తదితర 30 రకాల (జనరల్ మరియు ల్యాబ్) ఆరోగ్య పరీక్షలు చేస్తారు.
  • తొలి దశలో ప్రతి జిల్లాలోని 5 మండలాల్లో ఈ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. మౌలిక వసతులు, సిబ్బంది లభ్యత ఆధారంగా రెండో దశలో మిగిలిన అన్ని మండలాలకు దీనిని విస్తరిస్తారు.
  • సెర్ప్ (SERP) ఆధ్వర్యంలో మహిళలను సమీపంలోని పీహెచ్‌సీలకు తరలిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్‌ సెంటర్లలో రిజిస్ట్రేషన్, జనరల్ చెకప్, బ్లడ్ శాంపిల్స్ కలెక్షన్ జరుగుతుంది. అక్కడినుంచి టీ-డయాగ్నస్టిక్స్‌కు శాంపిల్స్ తరలించి, అక్కడ పరీక్షలు చేస్తారు.
  • లబ్ధిదారుల ఆరోగ్య సమాచారాన్ని పదిలంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరికీ క్యూఆర్ (QR) కోడ్ అనుసంధానంతో (ABHA ID ద్వారా) డిజిటల్ హెల్త్ రికార్డులను సృష్టిస్తారు. ఈ-హెచ్ఎంఐఎస్ (e-HMIS) ప్లాట్‌ఫారమ్‌కు అనుసంధానిస్తారు. ఈ రిపోర్టులను నేరుగా లబ్ధిదారుల మొబైల్‌కు ఎస్ఎంఎస్ (SMS) రూపంలో, అలాగే 'ఈ-ఆరోగ్యం' (e-Aarogyam) యాప్ ద్వారా అందిస్తారు.
  • ఈ డిజిటల్ డేటాబేస్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లినా.. మహిళలు తమ రిపోర్టులను కాగితాల రూపంలో తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే సులభంగా వైద్య సేవలు పొందే అవకాశం లభిస్తుంది.

వాహనాలను సిద్ధం చేసుకోండి - మంత్రి ఆదేశాలు

ఈ బృహత్తర కార్యక్రమ పురోగతి, అమలు తీరుపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ బుధవారం సమీక్షించారు. ఈ స్క్రీనింగ్ కార్యక్రమం అమలులో అలసత్వం వహించవద్దని అధికారులను ఆదేశించారు. టెస్టుల కోసం గ్రామాల నుంచి మహిళలను హాస్పిటల్స్‌కు తీసుకురావడానికి…. పరీక్షల అనంతరం వారిని తిరిగి సురక్షితంగా ఇళ్ల వద్ద దింపడానికి వాహనాలను సమకూర్చాలని సెర్ప్‌ అధికారులకు సూచించారు.

ఒకేరోజు ఎక్కువ మందిని హాస్పిటల్‌కు తరలించి…. వారికి ఇబ్బంది కలిగించొద్దన్నారు. ఒక పద్ధతి ప్రకారం షెడ్యూల్‌ మెయింటేయిన్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్‌లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే…. వారికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చికిత్స ప్రారంభించాలన్నారు. స్క్రీనింగ్ జరిగే అన్ని హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లలో అవసరమైన మేర సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నారు.

మహిళల నుంచి రక్త నమూనాల సేకరణ మొదలుకొని.. వాటిని ల్యాబ్‌లకు చేర్చే వరకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి దామోదర సూచించారు. శాంపిల్స్ దెబ్బతినకుండా పక్కాగా కోల్డ్ చైన్ ప్రోటోకాల్స్‌ మెయింటైన్ చేయాలన్నారు. ల్యాబ్‌లో నమూనాల వివరాలు (డేటా) ఎంటర్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు దొర్లకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి హెచ్చరించారు. అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించి స్క్రీనింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More