TG Cabinet Decisions : ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్
తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరోవైపు మెట్రో రైలు టేకోవర్ చేసుకోవాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 60 సంవత్సరాలలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్స్‌తోపాటుగా అదనంగా రూ.10లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టినట్టుగా తెలిపింది.

ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాదల విషయంపై కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పింఛనర్లకు భారం కాకుండా.. చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణలోని 7.56 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లు ఉన్నారని, ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్స్‌తోపాటుగా అదనంగా రూ.10లక్షలు వచ్చేలా పథకం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. 17.7లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డులు అందజేస్తామన్నారు.
1998 వ్యాధులకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాబోయే రెండుమూడు రోజుల నుంచి ఎంప్యానల్ ఆసుపత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు సేకరిస్తామన్నారు. అంతేకాదు అదనంగా ప్రభుత్వం మరో రూ.528 కోట్లు యాడ్ చేసి.. ట్రస్టు ఖాతాలో జమ చేస్తుందన్నారు. సీఎస్, సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్టు నిర్వహణ ఉంటుందని పొంగులేటి తెలిపారు.
కేబినెట్ నిర్ణయాలు
- ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్‌టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మార్చి 13వ తేదీలోపు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ టేకోవర్ మెుత్తం విలువ సుమారు రూ.15000 కోట్లుగా అంచనా.
- మార్చి 16 నుండి 30 వరకు జరగనున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.
- బడ్జెట్ సమావేశాలు మార్చి 16న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. మార్చి 20న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. మార్చి 30 వరకు సమావేశాలు జరుగుతాయి.
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పేరును డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్చాలని, దాని ఉద్యోగులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం కిందకు తీసుకురావాలని కూడా నిర్ణయించారు.
- ఖమ్మం జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీ) 20 ఎకరాల భూమిని కేటాయించడం, కాంగ్రెస్ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి భూమి కేటాయింపులు, మహబూబాబాద్‌లోని గుమ్మదూర్ గ్రామంలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ)కి 70 ఎకరాల భూమిని కేటాయించడం వంటి నిర్ణయాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- వేసవికాలంలో మూడు నెలల నీటి సరఫరా ప్రణాళికతో పాటు ఆరోగ్యం, విద్యపై కూడా మంత్రివర్గం చర్చించింది.
- 2027 జాతీయ జనాభా లెక్కలకు కేంద్రం ప్రణాళికలు, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఏర్పాట్లపై కూడా వివరంగా చర్చించారు.
- హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (HLO) మొదటి దశ మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహిస్తారని, కేంద్రం అందించిన 34 నమూనా ప్రశ్నలతో సహా ఏర్పాట్లను సమీక్షించామని ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. జనాభా గణనలో దాదాపు 89,000 మంది పాల్గొంటారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


