తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతుండటంతో రాబోయే ఎండకాలంలో తాగునీరు, సాగునీటి కొరత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.

ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రతి నీటి బొట్టును పొదుపు చేయడం మనందరి బాధ్యత. మనం నిత్యం చేసే చిన్న చిన్న మార్పులతో వందల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు.
రోజువారీ గృహ వినియోగంలో నీటి పొదుపు చిట్కాలు
మన ఇంట్లో అత్యధికంగా నీరు వృథా అయ్యేది బాత్రూమ్, వంటగదిలోనే. వీటిని అరికట్టడానికి కొన్ని సులభమైన అలవాట్లను పాటించాలి.
షవర్ కింద స్నానం చేయడం వల్ల నిమిషానికి 15 నుంచి 20 లీటర్ల నీరు వృథా అవుతుంది. షవర్ బదులు బకెట్, మగ్గు వాడటం వల్ల సగానికి పైగా నీటిని ఆదా చేయవచ్చు.
బ్రష్ చేసేటప్పుడు, షేవింగ్ చేసుకునేటప్పుడు ట్యాప్ నిరంతరం తిప్పి ఉంచకూడదు. అవసరమైనప్పుడు మాత్రమే నీటిని వాడుకోవడం వల్ల రోజుకు దాదాపు 5 నుంచి 10 లీటర్ల నీరు ఆదా అవుతుంది.
ఇంట్లో లీక్ అవుతున్న ట్యాప్లు లేదా పైపులను వెంటనే బాగు చేయించండి. సెకనుకు ఒక చుక్క చొప్పున కారే ట్యాప్ వల్ల నెలకు దాదాపు 100 నుంచి 500 లీటర్ల నీరు వృథా అవుతుంది.
టాయిలెట్ ఫ్లష్లలో డ్యూయల్ ఫ్లష్ సిస్టమ్ను ఉపయోగించండి. లేదా ఫ్లషింగ్ ట్యాంక్లో ఒక నీటి సీసాని ఉంచడం ద్వారా ప్రతి ఫ్లష్కూ కొంత నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు.
కూరగాయలు, పండ్లు, బియ్యం, పప్పులు కడిగిన నీటిని పారబోయకుండా ఇంట్లోని మొక్కలకు పోయడానికి ఉపయోగించండి.
{{/usCountry}}కూరగాయలు, పండ్లు, బియ్యం, పప్పులు కడిగిన నీటిని పారబోయకుండా ఇంట్లోని మొక్కలకు పోయడానికి ఉపయోగించండి.
{{/usCountry}}పల్లెలు, గిన్నెలు తోమేటప్పుడు రన్నింగ్ ట్యాప్ కింద కడగడానికి బదులుగా.. ఒక పెద్ద టబ్లో నీటిని తీసుకుని శుభ్రం చేయడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.
ప్రస్తుతం దాదాపు ప్రతి ఇంట్లో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్లు ఉంటున్నాయి. ఒక లీటరు సురక్షితమైన నీటి కోసం ఆర్ఓ సిస్టమ్ సుమారు 2 నుండి 3 లీటర్ల నీటిని వేస్ట్ వాటర్ రూపంలో బయటకు పంపుతుంది. ఈ ఆర్ఓ వేస్ట్ వాటర్ పైపును ఒక బకెట్ లేదా డ్రమ్లోకి కనెక్ట్ చేయండి. ఈ నీటిని ఇల్లు తుడవడానికి, బట్టలు ఉతకడానికి, టాయిలెట్స్ శుభ్రం చేయడానికి లేదా వాహనాలు కడగడానికి సులభంగా ఉపయోగించవచ్చు.
మొక్కలకు మధ్యాహ్నం వేళల్లో కాకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నీరు పోయాలి. దీనివల్ల బాష్పీభవనం తగ్గి నీరు మొక్కల వేళ్లకు బాగా అందుతుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఇంటి తోటలకు కూడా అనుకూలం.
బైక్లు, కార్లను వాటర్ పైపు పెట్టి కడగడానికి బదులుగా.. బకెట్ నీరు, తడి గుడ్డతో తుడవడం అలవాటు చేసుకోవాలి.
మన బాధ్యత – భవిష్యత్తుకు భరోసా
ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో నీటి కొరతను అధిగమించడం కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. మనం చేసే చిన్న చిన్న నీటి పొదుపు చర్యలే రేపటి తీవ్రమైన కరువు నుంచి మన కుటుంబాలను, సమాజాన్ని కాపాడతాయి. 'నీటిని పొదుపు చేద్దాం - భవిష్యత్తును కాపాడుకుందాం!'