అనకాపల్లి జిల్లా ఎలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. టాటానగర్-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్ట్‌మెంట్లు మంటల్లో చిక్కుకుని ఒక వ్యక్తి మృతి చెందాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అగ్నిప్రమాదం గురించి తమకు అర్ధరాత్రి 12:45 గంటలకు సమాచారం అందిందని చెప్పారు.

అగ్ని ప్రమాదంలో B1, M2 కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. రైల్వే అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకుని ప్రయాణికులను రైలు నుంచి కిందకు దిగబెట్టడంలో సహాయం చేశారు.
రైలులో మంటలు చెలరేగినప్పుడు ప్రభావితమైన ఒక కోచ్‌లో 82 మంది ప్రయాణికులు, మరో కోచ్‌లో 76 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు మీడియాకు వెల్లడించారు. దురదృష్టవశాత్తు B1 కోచ్ నుండి ఒక మృతదేహం లభ్యమైంది అన్నారు. మృతుడిని చంద్రశేఖర్ సుందరంగా గుర్తించారు. దెబ్బతిన్న రెండు కోచ్‌లను రైలు నుండి వేరు చేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపే ప్రయత్నంలో ఉన్నారు.
అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి రెండు ఫోరెన్సిక్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. సహాయం, రైలు సమాచారం మొదలైన వాటిని అందించడానికి హెల్ప్‌లైన్ నంబర్‌లను ఏర్పాటు చేశారు.
ఎలమంచిలి - 7815909386
అనకాపల్లి - 7569305669
తుని - 7815909479
సామర్లకోట - 7382629990
రాజమండ్రి - 0883-2420541/43
ఏలూరు - 7569305268
విజయవాడ -0866 - 2575167
పలు రైళ్లు ఆలస్యం
విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్, బెంగళూరు హంసఫర్, షాలిమార్-చర్లపల్లి(18045), విశాఖ-లింగంపల్లి(12805), విశాఖ-గుంటూరు(17240) రైళ్లు 3 నుంచి 4 గంటలు ఆలస్యం అయ్యాయి.
{{/usCountry}}విశాఖ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖ వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్, పూరీ-తిరుపతి, ఈస్ట్‌కోస్ట్, బెంగళూరు హంసఫర్, షాలిమార్-చర్లపల్లి(18045), విశాఖ-లింగంపల్లి(12805), విశాఖ-గుంటూరు(17240) రైళ్లు 3 నుంచి 4 గంటలు ఆలస్యం అయ్యాయి.
{{/usCountry}}ఇక విశాఖకు రావాల్సిన గోదావరి, తిరుపతి-హావ్‌డా రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎలమంచిలి స్టేషన్‌లో స్టాప్ ఉన్న రైళ్లను రాకుండా ఆపుతున్నారు. ఇక స్టాప్ లేకుండా ఉన్నవాటిని పంపిస్తున్నారు. సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ల కోసం రైళ్లు పెద్ద ఎత్తున చూస్తున్నారు.