కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న SIRను స్వాగతిస్తున్నట్టుగా టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన SIR ను పార్టీ స్వాగతిస్తున్నట్లు, ఏపీలోనూ చేపట్టాలన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

పార్లమెంటు సజావుగా సాగేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అన్ని పార్టీల సహకారాన్ని కోరిందని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. సోమవారం ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో SIR గురించిన ఆందోళనలపై చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయన్నారు. ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ ఈ సమావేశంలో వివిధ అంశాలను లేవనెత్తిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాల పంపకంపై సమావేశంలో చర్చకు డిమాండ్ చేసినట్టుగా తెలిపారు.
జల్ జీవన్ మిషన్ అంశాన్ని కూడా తాను లేవనెత్తానని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు. ఈ పథకం ఎలా అమలు చేయబడుతుందో, ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో స్పష్టత వచ్చేలా పార్లమెంటులో చర్చ జరగాలని కోరారు. ఎస్ఐఆర్‌పై చర్చకు ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్న సందర్భంగా SIRపై తన పార్టీ అభిప్రాయాలను వినిపించారు.
పన్నెండు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు తమ వివరాలను చెక్ చేసుకునేందుకు, అప్‌డేట్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ కారణంగా ముసాయిదా ఎన్నికల జాబితా డిసెంబర్ 9వ తేదీకి బదులుగా డిసెంబర్ 16న విడుదల కానుంది. తుది ఓటర్లు జాబితా 2026 ఫిబ్రవరి 7వ తేదీకి బదులుగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తారు. రాబోయే ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల కచ్చితత్వం, సమగ్రతను పెంచడం ఈ చర్య లక్ష్యం.
అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో SIR జరుగుతోంది. SIR తదుపరి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కవర్ అయ్యే అవకాశం ఉంది.
{{/usCountry}}అండమాన్, నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో SIR జరుగుతోంది. SIR తదుపరి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు కవర్ అయ్యే అవకాశం ఉంది.
{{/usCountry}}