ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల సందడి కీలక ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణల ప్రక్రియ పూర్తి కావడంతో అర్హులైన అభ్యర్థుల తుది వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా దాఖలైన దరఖాస్తులలో పరిశీలన అనంతరం మొత్తం 50,815 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా, చెల్లుబాటు అయ్యేలా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

పరిషత్ సమరంలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన, భారతీయ జనతా పార్టీల అభ్యర్థులు పెద్ద సంఖ్యలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.
ఎంపీటీసీ నామినేషన్ల వివరాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్ల చెల్లుబాటు జాబితా ఇలా ఉంది.
తెలుగుదేశం పార్టీ (TDP): 19,760 నామినేషన్లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP): 17,726 నామినేషన్లు
జనసేన పార్టీ (JSP): 4,330 నామినేషన్లు
భారతీయ జనతా పార్టీ (BJP): 1,049 నామినేషన్లు
జడ్పీటీసీ నామినేషన్ల వివరాలు
జడ్పీటీసీ స్థానాల్లో హోరాహోరీ పోరుకు పార్టీలు సమాయత్తమయ్యాయి. చెల్లుబాటు అయిన నామినేషన్ల లెక్కలు చూస్తే..
తెలుగుదేశం పార్టీ: 1,693 నామినేషన్లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 1,445 నామినేషన్లు
జనసేన పార్టీ: 587 నామినేషన్లు
భారత జాతీయ కాంగ్రెస్ (INC): 316 నామినేషన్లు
భారతీయ జనతా పార్టీ: 227 నామినేషన్లు
విశాఖ మేయర్ బరిలో 15 మంది అభ్యర్థులు
మరోవైపు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం పోరు సైతం ఆసక్తిగా మారింది. విశాఖ మేయర్ ఎన్నికల బరిలో చివరికి 15 మంది అభ్యర్థులు నిలిచారని అధికారులు వెల్లడించారు. మెుత్తం 29 నామినేషన్లు దాఖలు కాగా.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 8 నామినేషన్లను రిటర్నింగ్ తిరస్కరించారు. మిగిలిన 21 చెల్లుబాటైన నామినేషన్లలో ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
వంగవీటి రాధా.. ఏబీవీ ఆలింగనం
విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఆదివారం నాటి ప్రచార పర్వంలో పొలిటికల్ హీట్‌ను పక్కన పెట్టి ఓ అరుదైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నగరంలోని గుణదల ప్రాంతంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్న ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ, అదే మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఒకరినొకరు ఎదురెదురుగా కలిశారు.
{{/usCountry}}విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ఆదివారం నాటి ప్రచార పర్వంలో పొలిటికల్ హీట్‌ను పక్కన పెట్టి ఓ అరుదైన, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నగరంలోని గుణదల ప్రాంతంలో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్న ప్రముఖ నేత వంగవీటి రాధాకృష్ణ, అదే మేయర్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఒకరినొకరు ఎదురెదురుగా కలిశారు.
{{/usCountry}}కూటమి నేతలతో కలిసి వంగవీటి రాధాకృష్ణ వాహనంపై వెళ్తూ గుణదలలో ముమ్మరంగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాధాను చూసి ప్రేమగా పిలిచారు. ఏబీవీ పిలుపు విని వెంటనే స్పందించిన రాధాకృష్ణ, ప్రచార వాహనం నుంచి కిందకు దిగి ఆయన వద్దకు వెళ్లారు.
పరస్పరం నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న ఇద్దరు నేతలు, కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. మేయర్ పీఠం కోసం ప్రత్యర్థులుగా పోటీ పడుతున్న ఇద్దరు కీలక వ్యక్తులు ఇలా రాజకీయాన్ని పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకోవడం ప్రచారంలో ఉన్న నాయకులను, అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.