...
...
Next Story

ఇక లో వోల్టేజ్ కష్టాలకు చెక్.. ఏపీలో భారీగా విద్యుత్ సబ్ స్టేషన్లు ప్లాన్ చేసిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా సబ్ స్టేషన్లు ప్లాన్ చేసింది. ప్రజలకు కరెంట్ కష్టాలను తీర్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు.

Published on: Mar 5, 2026, 11:49:57 IST
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయనగరంలో వేణుగోపాలపురం వద్ద 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణంపై సభ్యులు అదితి విజయలక్ష్మీ గజపతిరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు వేణుగోపాలపురం 220/132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం రీ టెండరింగ్ ప్రక్రియలో ఉందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఏపీలో భారీగా విద్యుత్ సబ్ స్టేషన్లు
ఏపీలో భారీగా విద్యుత్ సబ్ స్టేషన్లు

'ప్రాజెక్టులు పూర్తికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుని పని చేస్తున్నాం. వేణుగోపాలపురం సబ్ స్టేషన్ నిర్మాణం మార్చి 2027 నాటి పూర్తి చేస్తాం. విజయనగరానికి అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఖర్చుతో కూడుకున్నది. అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఆవశ్యకత, నిధుల అందుబాటును బట్టి పరిశీలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రతీ చోట 33/11 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 200 సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నాం.' అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

భవిష్యత్తు విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఈ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ. 6 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. విజయనగరం జిల్లాలో రూ. 46 కోట్ల విలువైన రెండు 220 కేవీ పనులు జరుగుతున్నాయని సభకు తెలిపారు. పారిశ్రామిక, వ్యాపార, గృహ, వ్యవసాయ వినియోగదారుల సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోందని, పెరుగుతున్న భవిష్యత్ విద్యుత్ డిమాండ్ కు తగినట్లు సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks