మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు పలువురి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
6 చోట్ల తనిఖీలు….

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు కడపలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ల ఆధారంగానే ఈడీ తమ దర్యాప్తును వేగవంతం చేసింది
వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చిలో వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రారంభంలో రాష్ట్ర పోలీసులు ఈ కేసును విచారించినప్పటికీ, 2020లో దర్యాప్తు సీబీఐకి బదిలీ అయింది. ఈ హత్య వెనుక పెద్ద కుట్ర ఉందన్న ఆరోపణలతో సీబీఐ లోతైన విచారణ జరిపి…. హత్య కుట్రలో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలపై వైఎస్ భాస్కర్ రెడ్డిని 2023 ఏప్రిల్ 16న అరెస్ట్ చేసింది.
డైవర్షన్ రాజకీయం - ఈడీ సోదాలపై వైఎస్సార్‌సీపీ
ఈడీ సోదాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ తనిఖీలు చేయిస్తున్నారని గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. రాష్ట్రంలో డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలు, పోలీసు వాహనంలో గంజాయి దొరకడం, సుగాలి ప్రీతి తల్లి చక్రాల కుర్చీ నిరసనను అడ్డుకోవడం మరియు అధికార పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడి కారు ఢీకొని యువతి మృతి చెందిన హిట్ అండ్ రన్ కేసు వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికే ఈడీని రంగంలోకి దించారని దుయ్యబట్టారు. డీఎస్సీ క్రీడా కోటా అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 అక్రమాలపై కూడా సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. మొదట సిట్ (SIT), ఆ తర్వాత సీబీఐ విచారణ జరిపాయని తెలిపారు.
{{/usCountry}}ఈ సమస్యల నుంచి తప్పించుకోవడానికే ఈడీని రంగంలోకి దించారని దుయ్యబట్టారు. డీఎస్సీ క్రీడా కోటా అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 అక్రమాలపై కూడా సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. మొదట సిట్ (SIT), ఆ తర్వాత సీబీఐ విచారణ జరిపాయని తెలిపారు.
{{/usCountry}}ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నప్పుడు, విచారణను ఎందుకు అడ్డుకుంటున్నారు… నిజాన్ని ఎందుకు బయటకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫున పలు కేసుల్లో వాదిస్తున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా, వివేకా హత్య కేసులోని నిందితుడి తరఫున కూడా హాజరవుతున్నారని, లాయర్ ఫీజుల కోసం ప్రజాధనాన్ని ఎంత ఖర్చు చేస్తున్నారో పారదర్శకంగా చెప్పాలని డిమాండ్ చేశారు. "వివేకానందరెడ్డి మా నాయకుడు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు. తప్పుడు కథనాలు, డైవర్షన్ రాజకీయాలు ఆపి విచారణ సాగనివ్వండి, నిజం బయటకు రానివ్వండి" అని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.