గోదావరి నదిలో దూకిన కుటుంబం.. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం గోదావరి నదిలోకి దూకింది. సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు పేర్కొంది.

Published on: Aug 17, 2026, 14:32:15 IST
By , Rajamahendravaram
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న నూకరాజు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేధింపులు తట్టుకోలేక ఆయన, తన భార్య మీనా, కుమార్తె సౌజన్యతో కలిసి ఆదివారం రాత్రి రాజమహేంద్రవరంలోని రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో నూకరాజు మనవడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.

గోదావరిలో దూకి ఫ్యామిలీ సూసైడ్
గోదావరిలో దూకి ఫ్యామిలీ సూసైడ్

కాకినాడలోని అశోక్ నగర్‌కు చెందిన నూకరాజు కుటుంబం కారులో రాజమహేంద్రవరం రోడ్-కమ్-రైలు వంతెన వద్దకు చేరుకుని రాత్రి 11.30 గంటల సమయంలో గోదావరిలోకి దూకారు. ఆ సమయంలో వంతెనపై నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు తక్షణమే స్పందించి, నదిలోని లంక గ్రామానికి చెందిన స్థానిక మత్స్యకారులను రంగంలోకి దించారు. వేగంగా స్పందించిన మత్స్యకారులు 10 ఏళ్ల బాలుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతనికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

ఘటనా స్థలంలో నూకరాజు రాసిన ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలోని పీఆర్‌ఓ రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుతున్న ఎస్‌కె.సాధిక్ ఖాన్ అనే వ్యక్తి తమ కుటుంబ తీవ్రంగా వేధిస్తున్నాడని ఆ నోట్‌లో పేర్కొన్నారు. సౌజన్య భర్త అంటే నూకరాజు అల్లుడు ఈ ఏడాది జులైలో మృతి చెందగా, అప్పటి నుంచి సాధిక్ ఖాన్ ఆమె వెంటే పడుతూ ఇబ్బంది పెడుతున్నాడని లేఖలో తెలిపారు.

మనుమడిని, కుమార్తెను, తనను చంపేస్తానని బెదిరించి, తమ బ్యాంకు ఖాతా పుస్తకాలు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నాడని లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు తాళలేకే తమ కుటుంబం ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సంబోధిస్తూ రాశారు. సౌత్ డివిజన్ డీఎస్పీ ఎ. శివప్రియ మాట్లాడుతూ.. ఆ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.

రాజమహేంద్రవరం టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. శివగణేష్ పర్యవేక్షణలో స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం కె. పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన ముగ్గురి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని రాజమహేంద్రవరం పోలీసులను ఆదేశించారు.

కాకినాడ ఎస్పీ జి. బిందు మాధవ్, ఈస్ట్ గోదావరి ఎస్పీ డి. నరసింహ కిషోర్‌లతో పవన్ కళ్యాణ్ మాట్లాడి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆ కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More