గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు.. ఇకపై 'స్వర్ణగ్రామం' శాఖ

పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళశాలల పేరుతోనే నడుస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థవంతమైన సేవలు అందుతాయని చెప్పారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై స్పష్టత ఇచ్చారు చంద్రబాబు.

Updated on: Dec 17, 2025, 16:36:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలనే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారు. ఇది సమర్థవంతమైన సేవలను నిర్ధారిస్తుందని అన్నారు. సచివాలయంలో జరిగిన ఐదో కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పీపీపీ మోడల్ కింద 10 వైద్య కళాశాలలను అభివృద్ధి చేయడం అనే అంశాన్ని ప్రస్తావించారు. ఈ 10 వైద్య కళాశాలలు వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం మంజూరు చేసిన 17 కళాశాలల్లో భాగంగా ఉన్నాయి.

సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు

పీపీపీ ద్వారా సేవలు మెరుగ్గా ఉంటాయి.

'పీపీపీ విధానం ద్వారా సేవలు మెరుగ్గా ఉంటాయి. వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని కొందరు అంటున్నారు. పీపీపీ విధానంలో నిర్మిస్తున్నప్పటికీ అవి ప్రభుత్వ కళాశాలలుగా పనిచేస్తాయి.' అని చంద్రబాబు అన్నారు. వైద్య కళాశాలలకు సంబంధించిన నియమాలను ప్రభుత్వమే నిర్దేశిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వారి సేవలను 70 శాతం ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి (సంక్షేమ ఆరోగ్య పథకం) విస్తరింపజేస్తామని, వైద్య సీట్లు కూడా పెంచామని చెప్పారు.

కేంద్రం కూడా పీపీపీ మోడ్ కింద ప్రాజెక్టులను చేపడుతోందని సీఎం గుర్తు చేశారు. విమర్శలకు తాను భయపడనని, ప్రజలకు నిజం చెప్పాలని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైజాగ్‌లోని రుషికొండ ప్యాలెస్‌కు రూ.500 కోట్లు ఖర్చు చేశారని, లేకుంటే రెండు వైద్య కళాశాలలకు నిధులు సమకూర్చుకునే అవకాశం ఉండేదని వైసీపీని చంద్రబాబు విమర్శించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

'గత ప్రభుత్వం అనేక తప్పులు చేసింది. జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేదు. అత్యధిక వడ్డీ రేట్లకు రుణాలు పొందింది. 13 నుండి 14 శాతం (వడ్డీ రేటు) వద్ద రుణం పొందడం ద్వారా సమస్యలను సృష్టించింది.' అని సీఎం చంద్రబాబు చెప్పారు.

అంతేకాకుండా రెవెన్యూ శాఖలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. వ్యవస్థలోని లొసుగులను గుర్తించి వాటిని ఉపయోగించుకోవడం వల్ల పని తప్పించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ శాఖలో ఈ దుస్థితి అధికంగా ఉందన్నారు.

సచివాలయాల పేరు మార్పు

మరోవైపు సచివాలయాల పేరు మార్పుపై చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇక నుంచి స్వర్ణగ్రామం శాఖగా మార్చాలని నిర్ణయించారు. గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్స్‌గా మారుస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించారు. ఈ మార్పు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వచ్చిన స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామ సచివాలయాలను మరింత ఎఫెక్టివ్‌గా మార్చాల్సి ఉందన్నారు. ఇకపై వీటిని విజన్ యూనిట్స్‌గా పిలుస్తామని, ఇవి ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా.. గ్రామీణ వికాసానికి విజనరీ ప్లాన్స్ రూపొందించే యూనిట్లుగా పని చేయాలన్నారు.

నిత్య విద్యార్థిగా ఉండాలి

కలెక్టర్ల సదస్సులో మెుక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష, చర్చలు జరగాలని చంద్రబాబు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలన్నారు. వివిధ అంశాలను తెలుసుకుంటూ.. అభివృద్ధిలో భాగం కావాలని చెప్పారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలను సాధించడానికి వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More