Vijayawada Municipal Corporation Elections 2026 : విజయవాడ నగర పాలక సంస్థ (వీఎంసీ) మేయర్ ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మేయర్ పీఠంపై కన్నేశారు. లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా (ఇండిపెండెంట్) పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏబీ వెంకటేశ్వరరావు పోటీలో ఉండాలని నిర్ణయించుకోవటంతో…. ఆయనకు కాంగ్రెస్, వామపక్షాలతోపాటు, పలు కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారం(ఇవాళ) మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన నామినేషన్ వేయనున్నారు. ఈ పరిణామంతో బెజవాడ రాజకీయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ప్రజా సమస్యలపై పోరాటం…
గత కొంత కాలంగా ప్రజా సమస్యలపై ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 22ఏ భూముల వివాదంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన… రావు ప్రభుత్వ తీరును తప్పు బడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. రాజధాని నిర్మాణం, కీలకమైన నీటి ప్రాజెక్టులతో పాటు పలు అంశాలపై స్పందిస్తూ… ప్రభుత్వం దృష్టికి కీలక సమస్యలను తీసుకెళ్తున్నారు.
విజయవాడలో పట్టు ఉన్న వామపక్షాలు మద్దతుతో ఏబీవీ బరిలోకి దిగుతున్నారు. ఆయా పక్షాల నుంచి మంచి మద్దతు లభించే అవకాశం స్పష్టంగా ఉంటుంది. అంతేకాకుండా మాజీ ఐపీఎస్ అధికారి కావటంతో… యువతతో పాటు పలు వర్గాల నుంచి ఓట్లు రావొచ్చనే అంచనాలు మొదలయ్యాయి.
ఇక ఏబీ వెంకటేశ్వర రావు బరిలో నిలవటం ఖరారు కావటంతో… ఎవరి ఓట్లను చీల్చుతారు..? ఎవరికి మేలు జరుగుతుందీ..? ఏ మేర ప్రభావం చూపుతారనే చర్చ మొదలైంది. ఇదే సమయంలోనే అనేక సమీకరణాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఒప్పందంలో భాగంగా వంగవీటి రాధాకృష్ణను మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించాయి. అభ్యర్థి ప్రకటన కంటే ముందే… టీడీపీలోని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరంతా కూటమి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాధాకు మద్దతిస్తారా..? లేక తట్టస్థంగా ఉండి ఏబీకి మద్దతు ఇస్తారా అనేది కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అటు కూటమి అభ్యర్థి కాకుండా… అదే సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఓటు వేయడానికి సుముఖంగా లేని ఓటర్లు…. ఏబీ ఎంట్రీ ఒక ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందనే వాదన కూడా మొదలైంది.
{{/usCountry}}తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఒప్పందంలో భాగంగా వంగవీటి రాధాకృష్ణను మేయర్ అభ్యర్థిగా బరిలోకి దించాయి. అభ్యర్థి ప్రకటన కంటే ముందే… టీడీపీలోని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరంతా కూటమి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాధాకు మద్దతిస్తారా..? లేక తట్టస్థంగా ఉండి ఏబీకి మద్దతు ఇస్తారా అనేది కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అటు కూటమి అభ్యర్థి కాకుండా… అదే సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఓటు వేయడానికి సుముఖంగా లేని ఓటర్లు…. ఏబీ ఎంట్రీ ఒక ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందనే వాదన కూడా మొదలైంది.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు, కుల సమీకరణలు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి ప్రధాన రాజకీయ పార్టీ కూడా విజయవకాశాలను బేరీజు వేసుకునేటప్పుడు కులాల వారీ సమీకరణలను క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేస్తుంది. విజయవాడ మేయర్ ఎన్నికల పోటీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఏబీ వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా రేసులోకి వచ్చినప్పటికీ…… ఆయనకు పలు వర్గాల నుంచి బలమైన స్థాయిలో మద్దతు రావొచ్చనే చర్చ కూడా ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ బెజవాడ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఏబీవీ నేపథ్యం..!
- ఏబీ వెంకటేశ్వరరావు 1989 బ్యాచ్కు చెందిన ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు.
- గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) డీజీగా కూడా సేవలు అందించారు.
- ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2020 ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ పై ఆయన సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేశారు.
- అనేక మలుపుల తర్వాత, తన సర్వీసు కాలం ముగియడంతో ఏబీ వెంకటేశ్వరరావు 2024 మే 31న పదవీ విరమణ చేశారు.రిటైర్మెంట్కు సరిగ్గా ఒకరోజు ముందు ప్రభుత్వం ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- పదవీ విరమణ తర్వాత ఏపీలోని పలు సమస్యలపై పోరాడుతున్నారు.