YCP Kodali Nani : 2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం - మాజీ మంత్రి కొడాలి నాని
2029లో జగన్ సీఎం కావటం తధ్యమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.తన సొంత ఆస్తిలో కూడా చెల్లికి వాటా ఇచ్చారని చెప్పారు. అయినా వాళ్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా… తిరిగి ఒక మాట కూడా అనని మానవత్వం ఉన్న వ్యక్తి జగన్ అంటూ కామెంట్స్ చేశారు.
2029లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంపై స్పందించిన ఆయన… తన సొంత ఆస్తిలో కూడా చెల్లికి వాటా ఇచ్చారని చెప్పారు. అయిన వాళ్లు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా తిరిగి ఒక మాట కూడా అనని మానవత్వం ఉన్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. ఆ దేవుడి దయ వల్ల.. జగన్ 2029లో కచ్చితంగా సీఎం అవుతారని చెప్పుకొచ్చారు.

మానవత్వం ఉన్న వ్యక్తి జగన్ - కొడాలి నాని
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లిని తీసుకొచ్చి నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి చనిపోయినా ఆ ఆస్తిలో వాటా ఇచ్చే అన్నదమ్ములు ఉండాలి. కానీ తన సొంత ఆస్తిలో కూడా జగన్ వాటా ఇచ్చారు. చెల్లి ఎన్ని విమర్శలు చేసినా… చెల్లి కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మానవత్వం ఉన్న వ్యక్తి జగన్" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
తిరుమల లడ్డూ విషయంలో లేనిపోని ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కొడాలి నాని గుర్తు చేశారు. దేవుడి దయంతో ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి మొట్టికాయలు పడ్డాయో ప్రజలందరూ చూశారని తెలిపారు. కూటమిని దించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని…. దేవుడిదయతో వైఎస్ జగన్ సీఎం కావటం తథ్యమన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

