Mudragada Padmanabham : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
Mudragada Padmanabham : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ, ఇతర వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఏపీ సీఎం, రాజకీయ ప్రముఖులు, కాపు సంఘాల నేతలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
{{^htLoading}} {{/htLoading}}
1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ, అతిపిన్న వయసులోనే ప్రజా జీవితంలోకి వచ్చారు. 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలో కీలక నేతగా ఎదిగారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా విజయం సాధించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాలలో మంత్రిగా పనిచేశారు.
ముద్రగడ పద్మనాభం పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కాపు ఐక్య గర్జన, కాపు రిజర్వేషన్ల పోరాటం. కాపు సామాజికవర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపించారు. 2016లో ఆయన నేతృత్వంలో జరిగిన ఐక్య గర్జన, తుని రైలు దహనం ఘటన ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనియాంశమైంది.
ముద్రగడ రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ ఒకే పార్టీకి పరిమితం కాలేదు. ఆయన 1990ల చివరలో బీజేపీలో చేరారు. ఆ తర్వాత 1999లో మళ్లీ టీడీపీ తరఫున కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004, 2009 ఎన్నికల ఓటముల తర్వాత కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, మార్చి 15, 2024న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తన కుమారుడితో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.