...
...
Next Story

మళ్లీ రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి - కీలక వ్యాఖ్యలు..!

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. లిక్ర్ కేసులో ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published on: Jan 22, 2026, 20:35:45 IST
Advertisement

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ నుంచి నోటీసులు అందుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. 7 గంటల పాటు ఆయన విచారణ కొనసాగింది. లిక్కర్ పాలసీ విధాన నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. విజయసాయిరెడ్డి స్టేట్‌మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేశారు.

విజయసాయిరెడ్డి (ఫైల్ ఫొటో)
విజయసాయిరెడ్డి (ఫైల్ ఫొటో)

ఈడీ విచారణ తర్వాత బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.

“నేను రాజకీయాల నుంచి తప్పుకోను. నా భవిష్యత్ ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తాను. ఈ నెల 25తో నాకు రాజకీయాల్లో ఏడాది ముగుస్తుంది. తిరిగి రాజకీయాల్లోకి వస్తాను” అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

పార్టీలో నంబర్‌ 2 స్థానం అనేది లేదని స్వయంగా వైఎస్ జగన్ చెప్పారని ఈడీకి తెలిపానని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రాంతీయ పార్టీల్లో నంబర్‌ 2 అనేది ఉండదని చెప్పానని పేర్కొన్నారు.

“కేసులు చుట్టుముట్టిన తర్వాతే నన్ను ‘నంబర్‌2’గా ప్రచారం చేశారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నల్లో కొన్ని మాత్రమే రికార్డు చేశారు. మరికొన్ని ప్రశ్నలను రికార్డు చేయలేదు. లిక్కర్ స్కాం గురించి నాకు తెలియదు. లిక్కర్ స్కాంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారినే అడగాలని చెప్పాను” అని విజయసాయి రెడ్డి వివరించారు.

వైసీపీ అధికారం కోల్పోయిన ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి చక్రం తిప్పిన నేతగా పేరొందిన విజయసాయిరెడ్డి… వైసీపీకి రాజీనామా చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. పార్టీ పదవులకు కూడా రాజీనామా చేశారు. కొద్ది నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీని వీడిన సమయంలో మాట్లాడిన ఆయన… తాను ఏ రాజకీయపార్టీలో చేరబోనని కూడా చెప్పారు. అయితే అనూహ్యంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ప్రశ్నగా మారింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks