Vijaysai Reddy New Party : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం స్పష్టమైన శూన్యత కనిపిస్తోందని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ధ్యేయంగా నవంబర్ 11న ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

దేశభక్తి, ప్రజా సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణే ముఖ్యాంశాలుగా తమ నూతన పార్టీ నడుస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 11న పార్టీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేయడం వెనుక ఎలాంటి ఇతర వ్యూహాలు లేవని, పురోహితులు నిర్ణయించిన శుభ ముహూర్తం ప్రకారమే ఆ తేదీని ఎంచుకున్నామని ఆయన వెల్లడించారు.
"ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ), ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ రెండింటి తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రెండు పార్టీలతో విసిగిపోయిన ప్రజలు ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన ఈ రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికే మేము నవంబర్ 11న కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయించాం," అని శుక్రవారం పీటీఐ (PTI)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విజయసాయిరెడ్డి తెలిపారు.
ఆ 2 పార్టీలు విఫలం - విజయసాయిరెడ్డి
రాష్ట్రంలో వరుసగా పరిపాలించిన ప్రభుత్వాల తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శాంతిభద్రతల నిర్వహణతో పాటు కీలక రంగాల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు గణాంకాలను బయటపెట్టారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి రూ. 1 లక్ష కోట్లుగా ఉన్న బహిరంగ అప్పులు…. ఇప్పుడు ఏకంగా రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడిపై సగటున రూ. 5.5 లక్షల అప్పు భారం పడిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్రంతో సమన్వయం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యం!
{{/usCountry}}రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ పలు గణాంకాలను బయటపెట్టారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి రూ. 1 లక్ష కోట్లుగా ఉన్న బహిరంగ అప్పులు…. ఇప్పుడు ఏకంగా రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపించారు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడిపై సగటున రూ. 5.5 లక్షల అప్పు భారం పడిందని ఆయన పేర్కొన్నారు.
కేంద్రంతో సమన్వయం.. ఏపీ ప్రయోజనాలే లక్ష్యం!
{{/usCountry}}తమ కొత్త పార్టీ ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇక్కడి ప్రజల ప్రయోజనాలను కాపాడటమేనని విజయసాయిరెడ్డి చెప్పారు. ఢిల్లీలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో సమర్థవంతంగా సమన్వయం చేసుకుంటూ ఏపీ ప్రజలకు దక్కాల్సిన న్యాయాన్ని, నిధులను రాబట్టడానికి తమ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని వివరించారు.
ఒకప్పుడు వైఎస్సార్‌సీపీలో అత్యంత కీలక నాయకుడిగా వెలుగొందిన విజయసాయిరెడ్డి…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించేవారు. అయితే ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన ఆయన…. ఇప్పుడు సొంతంగా రాజకీయ పార్టీని ప్రకటిస్తుండటం తెలుగు రాష్ట్రాల రాజకీయంలో చర్చనీయాంశంగా మారింది.