తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ (చర్లపల్లి మీదుగా) నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసుల కాలపరిమితిని మరింత కాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ప్రత్యేక రైళ్లు పొడిగింపు - వివరాలు

తాజా పొడిగింపు షెడ్యూల్ ప్రకారం….. ఈ ప్రత్యేక రైళ్లు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్ణీత తేదీలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. ఈ రైళ్ల సమయాలు , ఆగే స్టేషన్లు, కోచ్‌ల సంఖ్య నిర్వహణ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు. పాత షెడ్యూల్ ప్రకారమే ఇవి నడుస్తాయి.
- సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్ (రైల్వే నంబర్ 07425 ) : ఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. గతంలో జూన్ 28 వరకు మాత్రమే ఈ సర్వీసు అందుబాటులో ఉండేది. తాజా పొడిగింపుతో ఈ రైలు జూలై 5 నుండి జూలై 12 వరకు, తిరిగి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27, 2026 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.
- శ్రీకాకుళం రోడ్ – సికింద్రాబాద్ ( రైల్వే నంబర్ 07426 ) : ఈ తిరుగు ప్రయాణ రైలు ప్రతి సోమవారం సర్వీసు అందిస్తుంది. గతంలో జూన్ 29తో ముగిసిన ఈ రైలు గడువును.. ఇప్పుడు జూలై 6 నుండి జూలై 13 వరకు… అలాగే తిరిగి ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 28, 2026 వరకు ప్రతి సోమవారం నడిచేలా పొడిగించారు.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 5 ఏసీ టూ-టైర్ కోచ్‌లు (AC 2-Tier), 4 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు (AC 3-Tier), 6 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్యాంట్రీ కార్, ఒక సిటింగ్-కమ్-లగేజ్ కోచ్, ఒక పవర్ కార్ అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ పొడిగించిన సర్వీసులను గమనించి తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని… టికెట్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాలని సూచించారు.
{{/usCountry}}ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 5 ఏసీ టూ-టైర్ కోచ్‌లు (AC 2-Tier), 4 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు (AC 3-Tier), 6 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్యాంట్రీ కార్, ఒక సిటింగ్-కమ్-లగేజ్ కోచ్, ఒక పవర్ కార్ అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ పొడిగించిన సర్వీసులను గమనించి తమ ప్రయాణాలను ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని… టికెట్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాలని సూచించారు.
{{/usCountry}}