...
...
Next Story

FTO in Kurnool : ఆంధ్రప్రదేశ్ వైమానిక చరిత్రలో సరికొత్త అధ్యాయం - కర్నూలులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం

కర్నూలు విమానాశ్రయంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి పైలట్ శిక్షణా కేంద్రాన్ని (FTO) కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.

Published on: Sep 26, 2026, 16:45:29 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైమానిక రంగ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. కర్నూలు విమానాశ్రయంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTO - పైలట్ శిక్షణా కేంద్రం) అధికారికంగా ప్రారంభమైంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ నూతన పైలట్ శిక్షణా కేంద్రాన్ని శనివారం…. ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

కర్నూలులో FTO ప్రారంభం!
కర్నూలులో FTO ప్రారంభం!

ఈ సెంటర్ ఏర్పాటుతో…. రాష్ట్రంలో విమానయాన రంగానికి, యువతకు లభించే ఉపాధి అవకాశాలకు సరికొత్త దిశను చూపించనుంది. సొంత రాష్ట్రంలోనే విమానాలు నడిపే పైలట్లుగా శిక్షణ పొందే అపూర్వ అవకాశం ప్రాంతీయ అభ్యర్థులకు లభించనుందని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.

తాజాగా ప్రారంభమైన తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌తో పాటు, రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరో 5 ఎఫ్‌టిఓ (FTO) లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కర్నూలు, రాజమండ్రి, కడప విమానాశ్రయాల కేంద్రంగా ఈ కొత్త పైలట్ శిక్షణా అకాడమీలు త్వరలోనే రాబోతున్నాయి. దీని ద్వారా మన రాష్ట్రానికి చెందిన ఎంతో మంది యువతకు స్వదేశంలోనే, సొంత రాష్ట్రంలోనే పైలట్లుగా శిక్షణ పొందే అపూర్వ అవకాశం లభించనుంది.

ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన రాయలసీమ… నేడు దేశంలోనే ప్రముఖ ఏరోస్పేస్ మరియు ఏవియేషన్ అవకాశాల కేంద్రంగా శరవేగంగా రూపాంతరం చెందుతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.

ఓర్వకల్లు (కర్నూలు) వద్ద భారతదేశంలోనే మొట్టమొదటి "డ్రోన్ సిటీ" ఏర్పాటు ప్రక్రియ షురూ అయిందని… కర్నూలు మరియు కడప కేంద్రాలుగా పైలట్ శిక్షణా అకాడమీలు, కుప్పం కేంద్రంగా ప్రపంచ స్థాయి శిక్షణా విమానాల (Trainer Aircraft) తయారీ పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టులన్నీ అందుబాటులోకి రావడం వల్ల రాయలసీమ యువతకు గ్లోబల్ స్థాయిలో నైపుణ్యాలతో కూడిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని చెప్పుకొచ్చారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks