Kuppam Trains Halt : కుప్పం అభివృద్ధిలో మరో ముందడుగు…. దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్ ప్రారంభం

కుప్పంలో దాదర్-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ హాల్ట్‌ను సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. కుప్పాన్ని ఎకనమిక్ హబ్‌గా, టూరిజం సెంటర్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 

Published on: Sep 22, 2026, 13:28:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో రవాణా వ్యవస్థను మరింత బలపరిచే దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా రైలు నెంబర్ 11005 'దాదర్ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్' అదనపు రైల్వే హాల్ట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో నేరుగా ప్రయాణికులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి…. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పలువురి నుంచి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు.

ప్రయాణికులకు సీఎం చంద్రబాబు అభివాదం
ప్రయాణికులకు సీఎం చంద్రబాబు అభివాదం

పెరగనున్న కనెక్టివిటీ…

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…. కుప్పం పరిధిలో ప్రస్తుతం 59 రైళ్లకు నిలుపుదల (హాల్ట్) ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంత వాసుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర రైల్వే శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. కుప్పం వేగంగా ఒక ప్రముఖ ఎకనమిక్ హబ్‌గా మారుతోందని, రైల్వే హాల్ట్‌ల సంఖ్య పెరగడం వల్ల వ్యాపారులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులకు రవాణా కష్టాలు తప్పుతాయని అన్నారు. కుప్పాన్ని ఇతర పొరుగు రాష్ట్రాలు, ముఖ్య ప్రాంతాలతో కనెక్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఎం వివరించారు. గుడిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. దీనితో పాటు డీకే పల్లి చెరువు వద్ద కూడా మరొక ఆర్వోబీని నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, త్వరలోనే బెంగళూర్-చెన్నై మధ్య 4 వరుసల భారీ రైల్వే లైన్ అందుబాటులోకి రానుందని, ఇది రవాణా రంగంలో పెద్ద మార్పులు తీసుకువస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

కుప్పం నుంచి చిత్తూరుకు నేరుగా రైల్వే లైన్ కనెక్టివిటీ కల్పిస్తే, ఈ ప్రాంత వాసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం దక్కుతుందని ముఖ్యమంత్రి వివరించారు. అలాగే, ఈ ప్రాంతం నుంచి వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతికి రైల్ కార్గో ద్వారా అపార అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పొగురుపల్లి సమీపంలో ప్రతిపాదించిన డ్రై పోర్టుకు నేరుగా రైల్వే లైన్ కనెక్ట్ చేసి, కార్గో రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తామని సీఎం హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో ఐటీ, వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని బెంగళూర్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి వందే భారత్ రైళ్లను నడిపించేలా పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More