Kuppam Railway station : కొత్తగా కుప్పం రైల్వే స్టేషన్‌లో ఆగనున్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఇవే
Kuppam Railway station : కుప్పం స్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ అదనపు స్టాపులను జోడించింది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనుంది.
కుప్పం నియోజకవర్గ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అవసరమైన కుప్పం రైల్వే స్టేషన్‌లో రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు హాల్ట్‌లను ప్రయోగాత్మకంగా కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 21న వాస్కో నుండి బయలుదేరే రైలు నెంబర్ 17315 వాస్కో డా గామా-వేళాంకన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ అర్ధరాత్రి 12:33 గంటలకు కుప్పం చేరుకుని 12:35 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 22న వేళాంకన్ని నుండి బయలుదేరే రైలు నెంబర్ 17316 వేళాంకన్ని-వాస్కో డా గామా వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9:33 గంటలకు కుప్పం చేరుకుని 9:35 గంటలకు బయలుదేరుతుంది.
అదేవిధంగా సెప్టెంబర్ 20న బయలుదేరే రైలు నం. 11005 దాదర్-పుదుచ్చేరి ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రాత్రి 10:45 గంటలకు వచ్చి 10:47 గంటలకు బయలుదేరుతుంది. అలాగే సెప్టెంబర్ 22న పుదుచ్చేరి నుండి బయలుదేరే రైలు నం. 11006 పుదుచ్చేరి-దాదర్ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ తెల్లవారుజామున 3:28 గంటలకు కుప్పం వద్ద ఆగి 3:30 గంటలకు బయలుదేరుతుంది.
ఈ అదనపు హాల్ట్‌లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయి. ఇవి కుప్పం ప్రాంతానికి రైలు రవాణా సౌకర్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని అధికారులు తెలిపారు.
చర్లపల్లి-శ్రీకాకుళం స్పెషల్ ట్రైన్స్
హైదరాబాద్‌లోని చర్లపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో ఇరు మార్గాల్లో చెరో 8 ట్రిప్పుల చొప్పున మొత్తం 16 సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. అక్టోబర్ 6, 2026 నుంచి నవంబర్ 25, 2026 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
రైలు నంబర్ 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్) రైలు ప్రతి వారం మంగళవారం రోజున చార్లపల్లి నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 6, 13, 20, 27 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 3, 10, 17, 24 తేదీలలో మొత్తం 8 సర్వీసులు నడుస్తాయి.
రైలు నంబర్ 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి ) రైలు తిరుగు ప్రయాణంలో ప్రతి వారం బుధవారం రోజున శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. అక్టోబర్ నెలలో 7, 14, 21, 28 తేదీలలో, అలాగే నవంబర్ నెలలో 4, 11, 18, 25 తేదీలలో మొత్తం 8 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన రైల్వే జంక్షన్లలో ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చిపురుపల్లి స్టేషన్లలో స్టాప్‌లు కల్పించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


