అమరావతిలో తొలిసారి రిపబ్లిక్‌ డే వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరావతిలో ఈ వేడుకలు తొలిసారిగా జరిగాయి

Published on: Jan 26, 2026, 10:39:35 IST
By , Amaravati
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో మెుదటిసారి వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు లోకేశ్‌, అచ్చెన్నాయుడు, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

అమరావతిలో రిపబ్లిక్ డే
అమరావతిలో రిపబ్లిక్ డే

హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన మైదానంలో వేడుకలు జరిగాయి. పరేడ్‌లో పాల్గొన్న 11 దళాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. 22 శకటాలను ప్రదర్శించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు మెుదటిసారిగా నిర్వహించింది.

అమరావతి వేలాది మంది రైతుల త్యాగ ఫలితం అని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. ఇది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కలలకు చిహ్నం. రాజధాని కోసం స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చిన రైతుల ధైర్యం, ఈ చారిత్రాత్మక వేడుకల వెనుక ఉన్న నిజమైన శక్తి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అమరావతిలో తొలిసారిగా జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలను ప్రదర్శించారు. వందేమాతరం, పది సూత్రాల మిషన్, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ, పాఠశాల విద్య, వ్యవసాయ శాఖ, సీఆర్‌డీఏ తదితర విభాగాల శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో రూపొందించిన శకటాలు ఉన్నాయి. ఈ వేడుకల్లో అమరావతి రైతులు, స్థానికులు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు.

రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రజలకు విషెస్ చెప్పారు. 'సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభ దినోత్సవాన దేశ ప్రజలు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనల్ని మనం పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును ఘనంగా జరుపుకొందాం. డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ.. మనకు ఇచ్చిన రాజ్యాంగం... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పునాదులు వేసింది. ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ విలువలు కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కోరుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.' అని చంద్రబాబు విషెస్ చెప్పారు.

'77వ గణతంత్ర దినోత్సవ శుభవేళ అందరికీ శుభాకాంక్షలు. మువ్వన్నెల జాతీయ పతాక రెపరెపలు మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, హక్కులకు ప్రతీక. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణానికి పాటుపడదాం.' అని మంత్రి నారా లోకేశ్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More