Polavaram District : పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ఉదంతం జిల్లాలోని ఎటపాక మండలం గొల్లగూడెం గ్రామ సమీపంలో జరిగింది.
ప్రాథమిక వివరాల ప్రకారం.... గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు చేపల వేట కోసం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలోకి దిగారు. అయితే… ఆ ప్రాంతంలో నది లోతు ఎక్కువగా ఉండటంతో ప్రవాహ ఉధృతికి వారంతా ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటిలో మునిగిపోవడంతో ఊపిరాడక ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మరియు సహాయక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నదిలో మునిగిపోయిన ఐదు మృతదేహాలను సిబ్బంది బయటకు వెలికితీశారు. మృతులలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు ధృవీకరించారు. వీరంతా గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఒకే ప్రాంతం వారు కావడంతో ఆ గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
చేపల వేటకు వెళ్లిన వారు శవాలై ఇంటికి రావడంతో మృతుల కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఒకేరోజు… ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో గొమ్ముకొత్తగూడెంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి…
గోదావరిలో ఐదుగురు గిరిజనుల మృతి మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
{{/usCountry}}గోదావరిలో ఐదుగురు గిరిజనుల మృతి మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
{{/usCountry}}