...
...
Next Story

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో పరిణామం - ఏ2 వాసుదేవరెడ్డి అరెస్ట్..!

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అప్పటి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సిట్‌ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు.

Published on: Feb 22, 2026 07:18 AM IST
Advertisement

ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్నఅప్పటి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సిట్‌ శనివారం అరెస్ట్ చేసింది.

రిమాండ్ విధింపు…

మద్యం కుంభకోణం కేసులో A2 వాసుదేవరెడ్డి అరెస్ట్
మద్యం కుంభకోణం కేసులో A2 వాసుదేవరెడ్డి అరెస్ట్

2019 నుంచి 2024 మధ్య వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ విధానం అమలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సిట్ విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయగా…. తాజాగా వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా… ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఫిబ్రవరి 9వ తేదీన సిట్‌ అధికారులు వాసుదేవరెడ్డికి నోటీసులిచ్చారు. ఈ మేరకు శనివారం ఉదయం విచారణకు హాజరయ్యారు. లిక్కర్ వ్యవహారానికి సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

గత వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన వాసుదేవరెడ్డి నుంచి పూర్తి వివరాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీలు, మద్యం సరఫరాదారులకు, ఆ తర్వాత హవాలా యూనిట్లు, షెల్ కంపెనీలకు సరఫరా వంటి అంశాల్లో వాసుదేవరెడ్డి పాత్ర కీలకంగా ఉందని…. ఆయన నోరు విప్పితే చాలా అంశాలు బయటికి వస్తాయని సిట్ భావిస్తోంది.

గత వైసీపీ హయాంలో మద్యం కేటాయింపుల అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసును సీఐడీ ప్రత్యేకంగా విచారిస్తోంది. సీఐడీ విచారణ ఆధారంగానే ఈడీ కూడా ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe