Srisailam Free Bus Service : కార్తీకమాసం వేళ శ్రీశైలం భక్తులకు శుభవార్త - ఉచిత బస్సు సేవలు ప్రారంభం, వివరాలివే

Srisailam Free Bus Service : కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైల దేవస్థానం భక్తులకు తీపి కబురు అందించింది. నవంబరు 10 నుంచి డిసెంబరు 9 వరకు భక్తుల కోసం ఉచిత బస్సు సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Published on: Nov 11, 2026, 08:27:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Srisailam Free Bus Service : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు నెల రోజుల పాటు క్షేత్ర పరిధిలో ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈవో) యం. శ్రీనివాసరావు సంయుక్తంగా వెల్లడించారు.

శ్రీశైలంలో ఉచిత బస్సు సేవలు
శ్రీశైలంలో ఉచిత బస్సు సేవలు

బస్సు మార్గాలు ఇలా...

కార్తీక మాసంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవి దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ రవాణా ఏర్పాట్లు చేశారు. పాతాళగంగ మెట్లమార్గం నుంచి ప్రారంభమయ్యే ఈ ఉచిత బస్సులు నందిసర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్ మీదుగా నేరుగా లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్ల వరకు నడుస్తాయి.

సమయ వేళలు…..

భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ ఉదయం 5:00 గంటల నుంచే ఈ ఉచిత బస్సు సేవలు అందుబాటులోకి వస్తాయి. రాత్రి 9:00 గంటల వరకు నిరంతరాయంగా ఈ బస్సులు తిరుగుతాయి. క్షేత్రానికి వచ్చే భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని…. స్వామివారి దర్శనాన్ని సులభంగా చేసుకోవాలని దేవస్థానం అధికారులు కోరారు.

కార్తీక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి శ్రీశైలానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఆలయ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వీఐపీల కంటే సామాన్య భక్తులకు త్వరితగతిన, సులభంగా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఆలయ దర్శన వేళలు, సేవల్లో కీలక మార్పులు ప్రకటించారు.

  • శని, ఆది, సోమవారాల్లో విపరీతమైన భక్తుల రద్దీ ఉండే రోజుల్లో కేవలం అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
  • సామాన్య భక్తుల దర్శన వేళలకు అంతరాయం కలగకుండా నెల రోజుల పాటు పలు ఆర్జిత సేవలను దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. రద్దీ రోజుల్లో నిర్వహించే రూ.5,000 గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 సామూహిక అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు.
  • ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవల టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
  • అమ్మవారి అంతరాలయంలో జరిగే రూ.1,000 కుంకుమార్చన సేవను భక్తుల సౌకర్యార్థం ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు.
  • ఆలయంలో జరిగే ఆర్జిత హోమాలు, నిత్య కళ్యాణోత్సవ సేవలు ఎలాంటి మార్పులు లేకుండా నిర్దేశిత సమయాల్లో కొనసాగుతాయి.
  • ఏపీటీఎస్ అధికారిక వెబ్‌సైట్: www.tms.ap.gov.in ద్వారా లేదంటే.. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా టికెట్లను సులభంగా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More