శ్రీశైలం కార్తిక మసోత్సవాలు.. గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు

శ్రీశైలంలో మంగళవారం నుంచి కార్తిక మాసోత్సవాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేశారు.

Published on: Nov 9, 2026, 20:03:53 IST
By , Srisailam
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

కార్తిక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి శ్రీశైలానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ఆలయ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా వీఐపీల కంటే సామాన్య భక్తులకు త్వరితగతిన, సులభంగా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఆలయ దర్శన వేళలు, సేవల్లో కీలక మార్పులు ప్రకటించారు.

శ్రీశైలం కార్తికమాసోత్సవాలు
శ్రీశైలం కార్తికమాసోత్సవాలు

భక్తుల రద్దీని బట్టి వారంలో వేర్వేరు రోజుల్లో వేర్వేరు దర్శన విధానాలను అమలు చేయనున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. శని, ఆది, సోమవారాల్లో విపరీతమైన భక్తుల రద్దీ ఉండే రోజుల్లో కేవలం అలంకార దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సామాన్య భక్తుల దర్శన వేళలకు అంతరాయం కలగకుండా నెల రోజుల పాటు పలు ఆర్జిత సేవలను దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది దేవస్థానం. రద్దీ రోజుల్లో నిర్వహించే రూ.5,000 గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 సామూహిక అభిషేకాలను పూర్తిగా రద్దు చేశారు.

ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవల టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అమ్మవారి అంతరాలయంలో జరిగే రూ.1,000 కుంకుమార్చన సేవను భక్తుల సౌకర్యార్థం ఆశీర్వచన మండపంలో నిర్వహించనున్నారు.

ఆలయంలో జరిగే ఆర్జిత హోమాలు, నిత్య కళ్యాణోత్సవ సేవలు ఎలాంటి మార్పులు లేకుండా నిర్దేశిత సమయాల్లో కొనసాగుతాయి. భక్తుల కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలను ప్రవేశపెట్టారు. సేవా రుసుము కేవలం రూ. 216 మాత్రమే. ఒక టికెట్‌పై దంపతులు లేదా ఒక వ్యక్తికి అభిషేకానికి అనుమతిస్తారు.

ఏపీటీఎస్ అధికారిక వెబ్‌సైట్: www.tms.ap.gov.in ద్వారా లేదంటే.. మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా టికెట్లను సులభంగా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. నవంబరు 10 నుండి డిసెంబరు 9 వరకు కార్తిక మాసోత్సవాలు జరగనున్నాయి. నవంబరు 24 నాటి సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వైభవంగా కోటి దీపోత్సవం జరగనుంది. కార్తిక మాసం సందర్భంగా భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఆలయ నిబంధనలను పాటించి స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More