Tirumala : నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం - ఆర్జిత సేవలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8వ తేదీన దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దయ్యాయి.
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 8వ తేదీన దీపావళి ఆస్థానాన్ని అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

ఘంటా మండపంలో స్వామివారి ఆస్థానం
పండుగ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో ఈ దీపావళి ఆస్థాన వేడుక జరుగుతుంది. ఈ విశేష ఆస్థానంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఘంటా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంపై గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.
అలాగే స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారికి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షణ దిశకు అభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం స్వామివార్లకు అర్చకులు వైఖానస ఆగమ నిబంధనల ప్రకారం ప్రత్యేక పూజలు, దివ్య హారతి, విశేష ప్రసాద నివేదనలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. వీటితో ఉదయం పూట జరిగే దీపావళి ఆస్థాన ఘట్టం పూర్తవుతుంది.
నాలుగు మాడ వీధుల్లో శ్రీవారి విహారం…
సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొంటారు. సహస్ర దీపాల కాంతిలో మెరిసిపోయే స్వామివారు, ఆ తర్వాత తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చి కటాక్షించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు…
దీపావళి ఆస్థానం వేడుకల నేపథ్యంలో నవంబర్ 8న ఆలయంలో జరిగే పలు నిత్య ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను పూర్తిస్థాయిలో రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే తోమాల సేవ, అర్చన సేవలను భక్తుల సమక్షంలో కాకుండా ఏకాంతంగా నిర్వహించనున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ కోరింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

