దీపావళి 2026 తేదీ, లక్ష్మీ పూజ ముహూర్తం.. ఈ 5 పరిహారాలతో లక్ష్మీదేవి అనుగ్రహం!

హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథి సందర్భంగా జరుపుకుంటారు. 2026లో నవంబర్ 8, ఆదివారం నాడు దీపావళి వస్తుందని అందించిన పంచాంగ వివరాలు పేర్కొంటున్నాయి. 

Published on: Oct 22, 2026, 16:00:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ ప్రత్యేకమైన పండుగను కార్తీక మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటాము. ఈ ఏడాది అమావాస్య ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు లక్ష్మీ పూజ ముహూర్తం వివరాలను కూడా తెలుసుకుందాం.

దీపావళి 2026 తేదీ, లక్ష్మీ పూజ ముహూర్తం.. ఈ 5 పరిహారాలతో లక్ష్మీదేవి అనుగ్రహం! (AI)
దీపావళి 2026 తేదీ, లక్ష్మీ పూజ ముహూర్తం.. ఈ 5 పరిహారాలతో లక్ష్మీదేవి అనుగ్రహం! (AI)

హిందూ మత విశ్వాసాల ప్రకారం, దీపావళి నాడు లక్ష్మీదేవి, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే శక్తి స్వరూపిణి అయిన కాళీమాతను కూడా ఆరాధించడం జరుగుతుంది. దీపావళి రోజు శుభ ముహూర్తంలో పూజలు చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుందని నమ్ముతారు. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇక ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వచ్చింది? అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే వివరాలను పూర్తిగా చూసేద్దాం.

దీపావళి 2026 తేదీ, సమయం పూర్తి వివరాలు

ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుకుంటాము. పంచాంగం ప్రకారం, నవంబర్ 8 ఉదయం 11:27 గంటలకు అమావాస్య తిథి మొదలవుతోంది. నవంబర్ 9 మధ్యాహ్నం 12:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూడాలి కనుక, నవంబర్ 8, ఆదివారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి.

దీపావళి 2026 శుభ ముహూర్తం వివరాలు

పంచాంగం ప్రకారం, నవంబర్ 8న ప్రదోష కాల సమయం సాయంత్రం 5:07 గంటల నుంచి రాత్రి 7:41 గంటల వరకు ఉంటుంది. వృషభ కాలం సాయంత్రం 5:31 గంటల నుంచి రాత్రి 7:29 గంటల వరకు ఉంటుంది. నిశీథ కాలం రాత్రి 11:07 గంటల నుంచి 11:58 గంటల వరకు ఉంటుంది. ఈ సమయాల్లో లక్ష్మీదేవిని ఆరాధించడానికి అనుకూలంగా ఉంటుంది.

దీపావళి నాడు ప్రదోష కాలం, వృషభ కాలం ప్రాముఖ్యత

దీపావళి నాడు లక్ష్మీదేవి పూజను ప్రదోష కాలం, వృషభ కాలంలో జరపడం అత్యంత అనుకూలమైనది. సూర్యాస్తమయం అయ్యాక ప్రదోష కాలంలో ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు.

లక్ష్మీ పూజ ముహూర్తం

లక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఈ సమయాలు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది నవంబర్ 8, ఆదివారం నాడు దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా మంచిది.

పూజ ప్రారంభ సమయం: సాయంత్రం 5:31 గంటలు.

పూజ ముగింపు సమయం: రాత్రి 7:29 గంటలు.

ఈ ఒక గంట 58 నిమిషాల సమయం లక్ష్మీదేవి పూజకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. సిరిసంపదలకు లోటు ఉండదని నమ్ముతారు. అలాగే, రాత్రి 11:07 గంటల నుంచి 11:58 గంటల వరకు నిశీథ కాలం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు.

దీపావళి నాడు పాటించాల్సిన సులువైన పరిహారాలు

1. లక్ష్మీదేవికి దీపారాధన

దీపావళి నాడు సాయంత్రం ఇల్లు శుభ్రంగా చేసుకున్నాక లక్ష్మీదేవి ఎదుట దీపారాధన చేయండి. ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.

2. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాలు

దీపావళి రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ముగ్గులు వేసి, అందంగా అలంకరించి దీపాలు వెలిగించండి. ఇది సానుకూలతను పెంచుతుందని విశ్వసిస్తారు.

3. లక్ష్మీదేవికి పసుపు, కుంకుమలు

దీపావళి నాడు లక్ష్మీదేవికి పసుపు, కుంకుమలను సమర్పించండి. పండ్లను నైవేద్యంగా సమర్పించండి.

4. పేదలకు అన్నదానం

దీపావళి నాడు శక్తి కొద్దీ దానాలు చేయడం మంచిది. దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

5. లక్ష్మీ గణేశ పూజ

దీపావళి నాడు లక్ష్మీ గణపతి పూజ చేయడం మంచిది. అలాగే, “ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రాన్ని కూడా జపించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More