దీపావళి క్యాష్ బెనిఫిట్స్ వాట్సాప్ మెసేజులు.. క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

దీపావళి క్యాష్ బెనిఫిట్స్ అంటూ ఫేక్ వాట్సాప్ మెసేజులు వస్తున్నాయి. నమ్మి ఏదైనా లింక్ మీద క్లిక్ చేస్తే.. మీ అకౌంట్ ఖాళీ అవుతుందని టీజీఎస్‌సీబీ హెచ్చరించింది.

Published on: Oct 30, 2026, 07:38:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రధానమంత్రి పేరుతో ప్రచారంలో ఉన్న మోసపూరిత వాట్సాప్ సందేశాల పట్ల జనాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) హెచ్చరించింది. కేంద్రం అందరికీ రూ. 8,000 దీపావళి క్యాష్ బెనిఫిట్స్ అందిస్తోందని మెసేజులు వస్తున్నాయి. ఆ సందేశాలలో ఉన్న అనుమానాస్పద వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయవద్దని అధికారులు హెచ్చరించారు.

దీపావళి గిఫ్ట్ ఫేక్ గిఫ్ట్ మెసేజులు
దీపావళి గిఫ్ట్ ఫేక్ గిఫ్ట్ మెసేజులు

పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని, ఇది అధికారిక ప్రభుత్వ పథకం అనే అభిప్రాయాన్ని కలిగించి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ సందేశాన్ని రూపొందించారని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ అన్నారు. ఇలాంటి అనుమానాస్పద లింకులు వినియోగదారులను మోసపూరిత వెబ్‌సైట్‌ల వైపు తీసుకెళ్తాయని, అవి వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరిస్తాయని హెచ్చరించారు. అనధికార యూపీఐ లావాదేవీలను సులభతరం చేయడానికి లేదా మెుబైల్ ఫోన్లలో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను జొప్పించడానికి సైబర్ నేరగాళ్లకు ఆ లింకులు ఉపయోగపడతాయని శిఖా గోయల్ తెలిపారు.

'ధృవీకరించని ఇలాంటి సందేశాలను నమ్మవద్దు. వాటిపై క్లిక్ చేయవద్దు. ఫార్వార్డ్ చేయవద్దని ప్రజలకు సూచిస్తున్నాం. ఏదైనా ప్రభుత్వ నగదు ప్రయోజన పథకం వివరాలను అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, ప్రభుత్వం జారీ చేసే అధికారిక ధృవీకరించిన ప్రకటనల ద్వారా కన్ఫామ్ చేసుకోవాలి.'అని శిఖా గోయల్ చెప్పారు.

ఇంటర్నెట్ వినియోగదారులు ఇలాంటి సందేశాలను ఫార్వార్డ్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఇతరులు సైబర్ మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసిన వారు తదుపరి సమాచారాన్ని నమోదు చేయకుండా, తమ ఖాతాలను, డివైజ్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని శిఖా గోయల్ హెచ్చరించారు. ఒకవేళ అనధికార ఆర్థిక లావాదేవీ జరిగితే, బాధితులు వెంటనే తమ బ్యాంకును సంప్రదించి, 1930 నంబర్‌కు ఫోన్ చేయడం లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు.

ధృవీకరించని వెబ్‌సైట్లలో ఓటీపీలు, యూపీఐ పిన్‌లు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ వెల్లడించవద్దని టీజీసీఎస్‌బీ పౌరులకు సూచిస్తోంది. అనవసరమైన సందేశాల ద్వారా ఎలాంటి డబ్బులు, గిఫ్ట్స్ రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో బ్యాంకింగ్ వివరాలను, ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More