శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త - ఉచిత లడ్డూలు ప్రారంభం, ఇవిగో వివరాలు

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు అందిస్తున్నారు. స్పర్శ దర్శనం చేసుకునే భక్తులకు రెండు లడ్డూలు, అతిశీఘ్ర దర్శనం చేసుకునే వారికి ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.

Published on: Dec 2, 2025, 11:13:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లే భక్తులకు శుభవార్త వచ్చేసింది.స్పర్శ దర్శనం,అతిశీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు ఉచితంగా లడ్డూలను పంపిణీ చేస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు.

శ్రీశైలం
శ్రీశైలం

కౌంటర్ల వివరాలు….

రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు మాత్రమే వీటిని పంపిణీ చేస్తారు. స్పర్శ దర్శనం టికెట్‌పై 100 గ్రాముల లడ్డూలు రెండు, రూ.300 దర్శనం టికెట్‌కు ఒక లడ్డూను అందజేస్తున్నారు.

ఈ ఉచిత లడ్డూల పంపిణీ కోసం ఆలయ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆలయంలోని 9,10 కౌంటర్లలో మాత్రమే ఈ ఉచిత లడ్డూలను అందజేస్తారు. కాబట్టి టికెట్లు తీసుకున్న ఈ భక్తులు… ఈ కౌంటర్లను సంప్రదించి లడ్డూలను పొందవచ్చని అధికారులు సూచించారు.

గత నవంబర్ నెలలోనే శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక చెంచు గిరిజనులకు ప్రతి నెల ఒకరోజు “మల్లన్న స్పర్శ దర్శనం” అవకాశం కల్పించాలని నిర్ణంచారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కొలనుభారతి ఆలయాన్ని దత్తత తీసుకునేందుకు కూడా బోర్డు ఆమోదం తెలపింది.

అదేవిధంగా రూ.500 స్పర్శ దర్శనం టికెట్ పొందిన భక్తులకు 100 గ్రాముల రెండు లడ్డూలు, రూ.300 టికెట్ పొందిన భక్తులకు 100 గ్రాముల ఒక లడ్డూను ఉచితంగా అందించే నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్నే డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More