ఏపీ : ఉచితంగా సివిల్స్ కోచింగ్ - వసతి, భోజన సౌకర్యం కూడా..! ఇలా అప్లయ్ చేసుకోండి
ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇవ్వనుంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి వీరాంజనేయస్వామి ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు సాంఘిక సంక్షేమశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా సివిల్స్ కోటించ్ తీసుకునేందుకు దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హులైన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఓ ప్రకటన ద్వారా కోరారు.

ఉచిత వసతి, భోజన సౌకర్యం…
ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం… రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇస్తారు. విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2024 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తారు.
నేటి నుంచే దరఖాస్తులు…
ఉచిత కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు నవంబర్ 16వ తేదీతో ముగుస్తుంది. అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించవచ్చు. ఇదే వెబ్ సైట్ ద్వారా మీ దరఖాస్తును సమర్పించవచ్చు.
ఇక తాజాగానే సివిల్స్ - 2025 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 22 నుంచి 31వ తేదీ వరకు యూపీఎస్‌సీ ఈ పరీక్షలను నిర్వహించగా… నవంబర్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించింది. మొత్తం 2,736మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఏపీ, తెలంగాణ నుంచి 150 మందిలోపు ఎంపికయ్యారని అంచనా. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 979 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబరు నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. https://upsc.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలతో పాటు మిగతా అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

