యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు.. తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకి ఎంతమంది ఎంపిక అయ్యారంటే?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇందులో తెలంగాణ నుంచి ఇంటర్వ్యూకి ఎంత మంది ఎంపిక అయ్యారు అంటే..?

Published on: Nov 12, 2025, 18:07:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు 2025ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2025కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా ఫలితాన్ని చెక్ చేయవచ్చు.

యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు
యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు

మెయిన్ పరీక్ష ఆగస్టు 22 నుండి ఆగస్టు 31, 2025 వరకు జరిగింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర కేంద్ర సర్వీసులకు (గ్రూప్ 'ఎ' మరియు గ్రూప్ 'బి') ఎంపిక కోసం పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కి పిలుస్తారు. 2736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు.

ఈ అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) తేదీలను ప్రకటిస్తారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం, ధోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ-110069లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి పిలిచే అభ్యర్థులు వారి అన్ని ఒరిజినల్ పత్రాలను తమతో తీసుకురావాలి. ధృవీకరణ కోసం ఈ పత్రాలు అవసరం.

ఎంపికైనవారికి లక్ష ఆర్థిక సాయం

యూపీఎస్సీ మెయిన్స్ పరీక్ష ఆగస్టు 22 నుండి ఆగస్టు 31 వరకు జరిగింది. ఫలితాలు యూపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇంటర్వ్యూకి తెలంగాణ నుంచి 43 మంది ఎంపికయ్యారు. అయితే ఇంటర్వ్యూకి సెలక్ట్ అయిన వారంతా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సాయం పొందినవారే. ఈ 43 మందికి త్వరలోనే రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారని తెలుస్తోంది.

వెబ్‌సైట్‌ ఫాలో కావాలి

వీరంతా తదుపరి దశ అయిన ఇంటర్వ్యూలో పాల్గొనవలసి ఉంటుంది. యూపీఎస్సీ తన వెబ్‌సైట్‌లో ఇంటర్వ్యూ తేదీలను విడుదల చేస్తుంది, ఇందులో పూర్తి ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంటుంది. దీని ఆధారంగా యూపీఎస్సీ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన అభ్యర్థులు ఇప్పుడు యూపీఎస్సీ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి.

ఇంటర్వ్యూ తర్వాత, తుది ఫలితం ప్రకటిస్తారు. ఇందులో యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్, మెయిన్స్, ఫైనల్ కటాఫ్‌లు ఉంటాయి. అభ్యర్థులు ఈ సమాచారాన్ని యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

ఈ లింక్ క్లిక్ చేసి యూపీఎస్సీ మెయిన్ ఫలితాలు చూడొచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More