...
...
Next Story

డిసెంబర్ మెుదటి వారం నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్.. ధరలు తెలుసుకోండి!

AP Ration Shops : ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. డిసెంబర్ మెుదటి వారం నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్‌ను అందించేందుకు సిద్ధమైంది.

Published on: Nov 25, 2026, 22:13:26 IST
Advertisement

పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల నుంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారీ ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకే కందిపప్పు, పామాయిల్‌ను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్
రేషన్ షాపుల్లో కందిపప్పు, పామాయిల్

సచివాలయంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌లో ధరల కట్టడి, సరుకుల లభ్యత, భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. వినియోగదారులపై ధరల భారం పడకుండా చూసేందుకు ప్రభుత్వం డిసెంబర్ మెుదటివారం నుంచే కందిపప్పు, పామాయిల్ అందించనుంది. రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు రూ.100కు, లీటర్ పామాయిల్ రూ.125కి అందించాలని చంద్రబాబు ఆదేశించారు.

సమీక్షా సమావేశంలో మార్కెట్ పరిస్థితులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను 286 నుంచి 500కు పెంచాలని సూచించారు.

నిత్యావసర సరుకులను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల నిఘా పెంచాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు విక్రయించే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యల వల్ల బహిరంగ మార్కెట్‌లో బియ్యం, ఉల్లిపాయలు, పామాయిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని పౌరసరఫరాల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ పండగలు, ఇతర సీజన్లలోనూ సామాన్యులకు ఇబ్బంది కలగకుండా బఫర్ స్టాక్స్ సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks