ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్ తెలిపింది. న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ సందర్భంగా సబ్సిడీపై గోధుమ పిండిని అందించనుంది. దీనికి రేషన్ కార్డుదారులు చెల్లించాల్సింది కేవలం రూ.20 మాత్రమే. జనవరి 1 నుంచి 20 రూపాయలకే కిలో గోధుమ పిండి జనాలకు అందనుంది. దీనితో మార్కెట్ ధర కంటే చాలా తక్కువకే గోధుమ పిండి ప్రజలకు దొరుకుతుంది. పండుగ సమయంలో పేద ప్రజలు కూడా పిండి వంటలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ ఆలోచన చేసినట్టుగా అర్థమవుతోంది.

ప్రస్తుతం మార్కెట్లో కేజీ గోధుమ పిండికి రూ.40 నుంచి 70 వరకు ఉంది. ఇది కూడా సాధారణ క్వాలిటీ పిండికి మాత్రమే. ఇక టాప్ బ్రాండ్ల గోధుమ పిండికి కేజీకి రూ.100 వరకు అమ్ముతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ధరలు మరింత ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా పేదలు, కూలీలు, తక్కువ ఆదాయ వర్గాలు ప్రజలు చాలా ఇబ్బందులు చూస్తున్నారు.
కేంద్రం కేటాయించిన గోధుమలను ఎఫ్‌సీఐ ద్వారా తీసుకుంటోంది ప్రభుత్వం. నాణ్యమైన గోధుమలను సేకరించి శుద్ధి చేసి పిండిగా తయారు చేస్తున్నారు. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా ప్రభుత్వం చూసుకుంటోంది. వాటిని గోధుమ పిండిగా మారుస్తుంది. ప్రతీ రేషన్ కార్డుకు ఒక కిలో చొప్పున ప్యాకెట్లను పంపిణీ చేయనుంది. డిసెంబర్ చివరి వరకు ప్రతీ జిల్లాలోని రేషన్ షాపులకు వీటిని పంపనున్నారు. జనవరి 1వ తేదీ నుంచి పంపిణీ జరగనుంది.
మెుదట ఈ పథకాన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, నగరాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరల ప్రభావం, పిండి వినియోగం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ గోధుమ పిండిని తీసుకునేందుకు రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపిస్తే.. డిమాండ్‌ను ఆధారంగా రాష్ట్రంలోని కార్డుదారులందరికీ ప్రతీ నెల సబ్సిడీపై గోధుమ పిండిని పంపిణీ చేస్తారు.
నెలనెలా ఎంత మేరకు గోధుమ పిండి సరఫరా చేయాలన్న దాని మీద ప్రభుత్వం డిమాండ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. మార్కెట్లో అధిక ధరతో పిండిని కొనలేకపోతున్న వారికి మంచి అవకాశం అవుతుంది.
{{/usCountry}}నెలనెలా ఎంత మేరకు గోధుమ పిండి సరఫరా చేయాలన్న దాని మీద ప్రభుత్వం డిమాండ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. మార్కెట్లో అధిక ధరతో పిండిని కొనలేకపోతున్న వారికి మంచి అవకాశం అవుతుంది.
{{/usCountry}}గతంలో గోధుమలను కార్డుదారులకు సరిగ్గా అందించలేదు. పిండి నాణ్యత సరిగాలేదని, వాసన పేరుతో చాలా మంది కార్డుదారులు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. మరోవైపు త్వరలోనే రేషన్ డిపోల ద్వారా రాగులు, జొన్నలు కూడా పంపిణీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.