WAPL : సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు మహిళల ఏపీఎల్.. ఫ్రీ ఎంట్రీ.. విద్యార్థులకు బస్సులు!
WAPL : మహిళా క్రికెటర్లను మరింత ప్రోత్సహించేందుకు ఏసీఏ ఆధ్వర్యంలో డబ్ల్యూఏపీఎల్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి 27వ తేదీ వరకు డే అండ్ నైట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి, యువ మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్(WAPL)ను నిర్వహిస్తోందని ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
మహిళల ఏపీఎల్
విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సెప్టెంబర్ 19 నుండి 27 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌కు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి హాజరవుతారని చెప్పారు. డబ్ల్యుఏపీఎల్ ప్రస్తుత సీజన్‌లో నాలుగు జట్లు పోటీపడతాయన్నారు. అన్ని మ్యాచ్‌లు మంగళగిరి స్టేడియంలోనే జరుగుతాయని వెల్లడించారు.
{{^htLoading}} {{/htLoading}}
ఈ మ్యాచ్‌లకు ప్రవేశం ఉచితమని చెప్పిన ఎంపీ, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. విద్యార్థులను విజయవాడ నుండి స్టేడియానికి తరలించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన తెలిపారు. టోర్నమెంట్‌ను విస్తరించేందుకు, తదుపరి సీజన్ నుండి డబ్ల్యూఏపీఎల్ మ్యాచ్‌లను విశాఖపట్నం, కడపలో నిర్వహిస్తామని ఏసీఏ అధ్యక్షుడు వెల్లడించారు.
'పురుషుల ఏపీఎల్‌లాగా ఉమెన్ ఏపీఎల్ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశాం. సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు మంగళగిరి స్టేడియంలో నాలుగు టీమ్‌లతో డే అండ్ నైట్ విధానంలో మ్యాచ్‌లు ఉంటాయి. ఉమెన్ ఏపీఎల్ ద్వారా మహిళా సాధికారతను చాటుతాం. ప్రేక్షకులు ఉచితంగా మ్యాచ్‌లు చూసేందుకు వీలు కల్పిస్తున్నాం. అంతేకాదు.. విజయవాడ నుంచి విద్యార్థులను స్టేడియానికి ఉచితంగా తీసుకువెళ్లేందుకు బస్సులు కూడా ఉంటాయి.' అని కేశినేని శివనాథ్ తెలిపారు.
ప్రతి రోజూ జరిగే మ్యాచ్‌లకు మహిళా న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వ్యాపారవెత్తలు, ఉన్నతాధికారులను ఆహ్వానిస్తారు. తొలిసారిగా ఫ్రాంచైజీ విధానంలో లిగ్ నిర్వహిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక సంస్థలు జట్లను సొంతం చేసుకున్నాయి.
రాబోయే ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం విజయవాడ నుండి మంగళగిరి వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు తెలిపారు. క్రీడాభిమానులు, యువత, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొనాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఏసీఏ క్రికెట్ కార్యకలాపాల డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, సీఈఓ జై కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.