IPL Tickets: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో మ్యాచ్.. ఈ రోజు టికెట్ సేల్స్.. ఫ్యాన్స్‌కు సన్‌రైజర్స్ ఆఫర్
IPL Tickets: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ. టీ20 ఎంటర్ టైన్మెంట్ తో ఫుల్ కిక్ అందించేందుకు కొత్త సీజన్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లోనే ఐపీఎల్ 2026 స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు ఇవాళే అందుబాటులోకి రాబోతున్నాయి. ఎక్కడ కొనాలో ఇక్కడ చూసేయండి.
క్రికెట్ లవర్స్ గెట్ రెడీ.. రెండు నెలల పాటు ఐపీఎల్ వినోదంలో మునిగిపోయేందుకు సిద్ధమైపోండి. ఐపీఎల్ 2026 వచ్చేస్తోంది. మార్చి 28నే ఐపీఎల్ కొత్త సీజన్ కు తెరలేవనుంది. మరో రెండు రోజుల్లోనే ఐపీఎల్ 19 ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే ఫస్ట్ హోం గేమ్ టికెట్లు ఇవాళే సేల్ కు వస్తున్నాయి.

సన్‌రైజర్స్ టికెట్లు
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన హోం గ్రౌండ్ లో ఆడే ఫస్ట్ మ్యాచ్ టికెట్ సేల్స్ ఈ రోజు (మార్చి 26) స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
మ్యాచ్ ఎప్పుడంటే?
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఏప్రిల్ 5న మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ టికెట్లు ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సేల్ కు వస్తున్నాయి. ‘డిస్ట్రిక్ట్ బై జొమాటో’ యాప్ లో ఈ టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పంచుకుంది.
స్పెషల్ ఆఫర్
తమ ఫ్యాన్స్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పెషల్ ఆఫర్ కూడా ప్రకటించింది. రెండు టికెట్లు కొన్న వాళ్లకు ఒక జెర్సీ ఫ్రీగా ఇవ్వనుంది. ఉప్పల్ స్టేడియంలో ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఏప్రిల్ 5న జరుగుతుంది. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది.
గ్రాండ్ ఓపెనింగ్
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఓపెనింగ్ కోసం బీసీసీఐ భారీ ఏర్పాట్లు చేస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. మార్చి 28న ఐపీఎల్ కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది.
డిఫెండింగ్ ఛాంపియన్
ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగింది. గత సీజన్ లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇదే ఫస్ట్ ట్రోఫీ.
మరోసారి ధోని, కోహ్లి, రోహిత్ లాంటి దిగ్గజాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఐపీఎల్ 2026కు రెడీ అవుతున్నారు. ధోని పూర్తిగా క్రికెట్ కు వీడ్కోలు పలకగా.. కోహ్లి, రోహిత్ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


