బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ - స్కాలర్ షిప్ నిధులు మంజూరు

ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద  స్కాలర్ షిప్పుల కోసం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

Published on: Dec 27, 2025, 10:57:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరంలో భాగంగా పీఎం యశ్వసి పథకం కింద రెండో విడతగా కళాశాల, పాఠశాల ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్పుల నిమిత్తం రూ.90.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత వివరాలను ప్రకటించారు.

బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్స్ విడుదల
బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్స్ విడుదల

2025-26 విద్యా సంవత్సరానికి గానూ రెండో విడతగా రూ.69.40 కోట్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు కోసం కూటమి ప్రభుత్వం మంజూరు చేసినట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ నిధులు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థులకు ఉపకరిస్తాయన్నారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు గానూ రెండో విడతగా రూ. 21.10 కోట్లను విడుదల చేసిందన్నారు. పాఠశాల స్థాయిలో చదువుతున్న అర్హులైన బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నామన్నారు.

రెండు ఉత్తర్వుల ద్వారా రూ. 90.50 కోట్లను వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కేటాయించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులతో బీసీ విద్యార్థులు విద్యకు దూరం కాకూడదన్నదే ఆయన లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ లు మంజూరు చేశారన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం నిధులు అన్ని వర్గాలతో పాటు బీసీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు పంపిణీ చేశామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నామని…. ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నామని చెప్పుకొచ్చారు. బీసీ హాస్టళ్లు, గురుకులా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు.

బీసీ గురుకులాల్లో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యమని స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More