ఇక గుంటూరులో 'జెన్‌ జెడ్‌ పోస్టాఫీస్‌' సేవలు - ప్రత్యేకతలెంటో తెలుసా..!

ఆధునిక టెక్నాలజీతో నేటితరానికి సేవలందించేందుకు కేంద్ర సమాచారశాఖ మరో అడుగు ముందుకేసింది. గుంటూరులోని విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరించి… జెన్ జెడ్ (Gen 'Z') పోస్ట్ ఆఫీస్ గా మార్చింది. ఈ సరికొత్త పోస్టాఫీస్ ను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం ప్రారంభించారు.

Published on: Dec 20, 2025, 14:17:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుంటూరు పోస్టల్ డివిజన్ లో విట్ (VIT-AP) సబ్ పోస్ట్ ఆఫీస్ ను ఆధునీకరణ చేసి జెన్ జెడ్ (Gen 'Z') పోస్ట్ ఆఫీస్ గా మార్చారు. ఈ పోస్ట్ ఆఫీస్ ను శనివారం కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ విట్ యూనివర్శిటీ క్యాంపస్ లో ప్రారంభించారు.

జెన్ జెడ్ (Gen 'Z') పోస్ట్ ఆఫీస్
జెన్ జెడ్ (Gen 'Z') పోస్ట్ ఆఫీస్

ప్రత్యేకతలు ఇవే

  • జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లు సంప్రదాయ పోస్టల్ కార్యాలయాలను యువత కేంద్రంగా, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సేవా కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా రూపొందించడం జరిగింది.
  • సులభంగా అందుబాటులో ఉండే విధంగా, విద్యార్థులకు అనుకూలమైన ప్రజా సేవలను అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు.
  • సాంకేతికత ఆధారిత, వినియోగదారుడి కేంద్రీకృత పరిష్కారాలను స్వీకరించడం ద్వారా యువతలో మారుతున్న అవసరాలు, ఆశయాలకు అనుగుణంగా పోస్టల్ సేవలను అందుబాటులోకి తేవడం జరుగుతుంది.
  • జెన్ జెడ్ పోస్టాఫీస్‌ను ప్రత్యేకంగా జనరేషన్ జెడ్ (Z) యువత అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
  • ఇందులో ఆధునిక వాతావరణం, డిజిటల్ చెల్లింపు సదుపాయాలు, సరళీకృత సేవల అందింపు విధానాలు, ఒకే చోట పోస్టల్, బ్యాంకింగ్, బీమా సేవలను సమగ్రంగా పొందే అవకాశం ఉంటుంది.

భాగస్వామ్యులను చేయటమే లక్ష్యం - కేంద్రమంత్రి పెమ్మసాని

ఈ సరికొత్త పోస్టాఫీస్ ప్రారంభం సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా దాదాపు 50 జెన్ జెడ్ పోస్టాఫీసులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీలో 3 ఏర్పాటైనట్లు తెలిపారు. రైల్వే తర్వాత అత్యధికంగా పోస్టల్ శాఖలో 4.50 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని గుర్తు చేశారు. కేవలం లెటర్స్ బట్వాడాకే పరిమితం కాకుండా కాకుండా ఈ కామర్స్ ప్లాట్ ఫాం గా మార్చామని… ప్రతి ఉద్యోగి తమ విధులు సజావుగా నిర్వహించేలా చూస్తున్నామని చెప్పారు.

“సాంకేతికత సాయంతో ప్రైవేట్ కొరియర్ సర్వీసులు కు దీటుగా పోస్టాఫీసు లను తయారు చేస్తున్నాం. మార్కెటింగ్ కోసం ఓ నిపుణుడుని ప్రత్యక అధికారిని నియమించాం. Gen Z పోస్టాఫీసు ఏర్పాటు లక్ష్యం యువతను ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులను చేయడమే. పోస్టల్ శాఖలో పెట్టే ఖర్చులతో 89 శాతం జీతాలకు సరిపోతున్నాయి. సామాజిక బాధ్యతగా చేసే కార్యక్రమాల వల్ల మేం ఎక్కువ చార్జీలు వసూలు చేయటం లేదు అందుకే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు ఆలోచిస్తున్నాం” అని కేంద్రమంత్రి చంద్రశేఖర్ తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More