...
...
Next Story

అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ.. ఎన్ని కిలో మీటర్లంటే?

వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని గుర్తుచేశారు.

Published on: Feb 14, 2026, 06:11:06 IST
Advertisement

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు గిరి ప్రదక్షిణపై ఆసక్తి పెరిగింది. అందులో భాగంగా ఎక్కువగా తమళినాడు రాష్ట్రంలోని అరుణాచలం ఎక్కువగా వెళ్తున్నారు భక్తులు. అరుణాచలం ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా నమ్ముతారు. అలాంటి ప్రదేశంలో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ గిరి ప్రదక్షిణ చేయవచ్చు.

శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ
శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ

శ్రీకాళహస్తిలో 22 కిలో మీటర్ల గిరి ప్రదక్షిణను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. భక్తులకు ఇది ఒక మంచి అవకాశం. చాలా మంది పౌరులు ఈ చర్యను స్వాగతిస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయం చుట్టూ 22 కి.మీ. గిరిప్రదక్షిణ మార్గాన్ని సచివాలయం నుండి ఉప ముఖ్యమంత్రి వర్చువల్ మోడ్‌లో ప్రారంభించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), అరణి శ్రీనివాసులు (తిరుపతి), దేవాదాయ శాఖ కార్యదర్శి హరి జవహర్‌లాల్‌తో కలిసి ప్రారంభించారు.

తమిళనాడులోని తిరువణ్ణామలై (అరుణాచలం) ఆలయంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు చేసే గిరి ప్రదక్షిణ తరహాలో శ్రీకాళహస్తి కొండ చుట్టూ ఆధ్యాత్మిక నడక అనే భావనను ప్రోత్సహించడానికి సుమారు రూ.10 కోట్ల ఖర్చుతో ఈ మార్గాన్ని అభివృద్ధి చేశారు. మహాశివరాత్రి పండుగ తర్వాత సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతామని పవన్ కళ్యాణ్ అన్నారు.

'శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి తప్పకుండా వస్తాను. వైసీపీ హయాంలో కొన్ని ఆలయాల్లో అపచరాలు చాలా జరిగాయి. పాలకమండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కావు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞత పూర్వకంగా పాలకమండళ్లు పని చేయాల్సిన అవసరం ఉంది. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు రూ.10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రతీ భక్తునికి గిరి ప్రదక్షిణతో కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలి. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం.' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe