AP Assembly : అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ - ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఆందోళన, సభ నుంచి వాకౌట్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలవ్వగానే వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీల్లో పీపీపీ పద్దతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ అధినేత జగన్ సహా.. ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

వైసీపీ ఆందోళన - సభ నుంచి వాకౌట్…
గవర్నర్ ప్రసంగం చేస్తుండగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేపట్టారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభ్యుల హక్కులను కాపాడాలంటూ ఆందోళన చేపట్టారు.మెడికల్ కాలేజీల్లో పీపీపీ పద్దతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బాయ్‌కాట్ చేస్తూ.. వాకౌట్ చేశారు.
సభకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పార్టీ అధినేత జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రతిపక్ష హోదాతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు."ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వరు, రాష్ట్రంలో కుప్పకూలిన శాంతి భద్రతలపై నిలదీయనివ్వరు" అంటూ నినాదాలు చేశారు.
గవర్నర్ ప్రసంగం - ముఖ్యమైన పాయింట్లు
జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ప్రతీ కుటుంబానికి అవసరమైన ప్రయోజనాలను అందిస్తున్నామన్నారు.
“త్వరలో ఫ్యామిలీ కార్డును ప్రభుత్వం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పీ4 ద్వారా పేద, ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎవరూ ఆకలితో ఉండకూడదనే సూత్రంతో 113 నియోజకవర్గాల్లో 205 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. త్వరలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ గ్రామీణ అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అందరికీ గృహాలు అనే లక్ష్యంతో గృహనిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఎస్సీ వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా చేసింది.” అని గవర్నర్ తన ప్రసంగాన్ని వినిపించారు.
“గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. బీసీల అభ్యున్నతికి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంస్ఎంఈల ద్వారా బీసీ వర్గాలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. మైనారిటీలకు భద్రత, వారికి అభివృద్ధిలో భాగస్వామ్యం, విద్య, ఆర్ధిక సహకారంతో మేలు చేకూరుస్తోంది.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని గవర్నర్ పేర్కొన్నారు.
- "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ, క్వాంటం కంప్యూటింగ్ లాంటి రంగాల్లో దూసుకెళ్తోంది. ప్రముఖ పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తోంది. అంతర్జాతీయ సంస్థలు ఏపీని పెట్టుబడులు, నాలెడ్జి ఎకానమీకి గమ్యస్థానంగా ఎంచుకున్నాయి.
- టెక్నాలజీని అందిపుచ్చుకోవటం ద్వారా యువతకు భవిష్యత్‌లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేలా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
- ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తోంది.
- యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి రూ.2.5 లక్షల వరకూ సమగ్ర ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తోంది 1.43 కోట్ల పేద కుటుంబాలకు రూ.25 లక్షల వరకు నగదు రహిత వైద్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.
- అక్రమ మద్యం తయారీ నుంచి విముక్తి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గంజాయి నిర్మూలనలో పురోగతి సాధించింది.
- యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రణాళికలు చేసింది
- గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా ఉపాధి రోజులను 100 నుంచి 125 రోజులకు పెంచారు.
- అభివృద్ధి వ్యూహంలో మహిళలే కేంద్ర బిందువులు, ఆర్ధిక భాగస్వాములు, స్వయం పేరుతో డ్వాక్రా మహిళలు రూపొందించిన ఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తోంది
- ఏడాదికి లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. వచ్చే ఏడాది 5 లక్షల మంది మహిళను పారిశ్రామిక వేత్తలుగా మార్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది
- అంగన్ వాడీలను బలోపేతం చేసి, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి ద్వారా మహిళలకు న్యాయ సహకారం కూడా అందిస్తోంది" అంటూ గవర్నర్ ప్రసంగించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

