...
...
Next Story

ఖరీఫ్ సీజన్ కోసం ధవళేశ్వరం బ్యారేజీ నుండి నీటి విడుదల.. 2.63 లక్షల ఎకరాలకు

ఖరీఫ్ సీజన్ కోసం ధవళేశ్వరం బ్యారేజీ నుండి గోదావరి నీటిని విడుదల చేశారు. దీంతో 2.63 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.

Published on: May 31, 2026, 21:02:12 IST
Advertisement

గోదావరి డెల్టా పరిధిలోని రైతాంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఖరీఫ్ సాగు పనులను ముందస్తుగానే ప్రారంభించేందుకు వీలుగా.. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుండి గోదావరి నీటిని విడుదల చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గోదావరి డెల్టా ప్రజాప్రతినిధులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

ధవళేశ్వరం బ్యారేజీ నుండి నీటి విడుదల
ధవళేశ్వరం బ్యారేజీ నుండి నీటి విడుదల

ఈ ముందస్తు నీటి విడుదల, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా విడుదల చేసిన ఈ నీరు గోదావరి డెల్టా పరిధిలోని 2.63 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు అందనుంది.

  • తూర్పు డెల్టా: 85,000 ఎకరాలు
  • నిడదవోలు, కొవ్వూరు కాలువలు: 41,000 ఎకరాలు
  • కాకినాడ జిల్లా పరిధి: 1.37 లక్షల ఎకరాలు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. ముందస్తు ఖరీఫ్ పనులను సజావుగా సాగించేందుకు రైతులు నీటిని పొదుపుగా, సమర్థవంతంగా నిర్వహించుకోవాలని కోరారు. డెల్టాలోని సాగునీటి కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 13 కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. రెండో విడతలో మిగిలిన కాలువలకు కూడా ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

కాటన్ బ్యారేజ్ పునర్నిర్మాణ పనులకు హామీ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ జి. హరీష్ మధుర్ రైతాంగానికి కీలక హామీ ఇచ్చారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ, పునర్నిర్మాణ పనులను రాబోయే కొద్ది నెలల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రారంభిస్తామని వారు ప్రకటించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks