...
...
Next Story

గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం.., విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదు : సీఎం చంద్రబాబు

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చామని, అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు.

Published on: Dec 3, 2025, 16:19:30 IST
Advertisement

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు సీఎం. వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారన్నారు. జగన్ ప్రభుత్వం పశువులకు దాణా కూడా ఇవ్వలేదని విమర్శించారు. వైసీపీ అక్రమాలకు అరికట్టేందుకు ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్‌తో కూటమితో ఎన్నికలకు వెళ్లామన్నారు.

రైతులతో చంద్రబాబు
రైతులతో చంద్రబాబు

'ముందుగా రైతుల సమస్యలు పరిష్కారించాలని అనుకున్నాం. దాని తర్వాత మిగతా సమస్యల మీద దృష్టి సారించాం. వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. వ్యవసాయం ద్వారా రాష్ట్రానికి ఆరు శాతం ఆదాయం వస్తుంది. వ్యవసాయంలో ఖర్చులు ఎక్కువ. ఆదాయం తక్కువ. వ్యవసాయ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. మేం రూపాయి ఇస్తే మీరు రూపాయి ఖర్చు పెట్టాలి. ' అని చంద్రబాబు అన్నారు.

ప్రస్తుతం వ్యవసాయ పనులు చేసేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని చంద్రబాబు అన్నారు. అందుకే యాంత్రికరణ జరగలన్నారు. పండించే పంట విలువ ఇక్కడ పరిస్థితిపై ఆధారపడి ఉండదని, ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో జరిగే పరిణామాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి అని చంద్రబాబు అన్నారు.

వ్యవసాయం సమస్యను పరిష్కరించేందుకు పంచ సూత్రాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఇందులో భాగంగా నీటి భద్రత కల్పించాలని భావించామన్నారు. కనీసం మన రాష్ట్రంలో నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామన్నారు.

'గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లోనైనా తరలిస్తాం. భూమిని జలాశయంగా చేసి, భూగర్భ జలాలు పెంచితే నీటి సమస్య రాదు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుంది. గతంలో రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోం అని మరోసారి చెబుతున్నా. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తున్నాం. గోదావరిని వంశధారకు కలుపుతాం. పెన్నా నదికి వరకు తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్‌లో తాగేందుకు, వ్యవసాయానికి, పారిశ్రామిరంగానికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. రైతన్నకు అండగా ఉంటామనేది మా మెుదటి నినాదం.' అని చంద్రబాబు అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe