విజయవాడలో DRI బిగ్ ఆపరేషన్ - రూ.5.84 కోట్ల విలువైన విదేశీ బంగారం, కరెన్సీ సీజ్
విజయవాడ సమీపంలో డీఆర్ఐ అధికారులు చేపట్టిన సోదాల్లో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, డాలర్లు, యూరోలు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా రూట్ మార్చి, కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ ముఠా గుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) అధికారులు రట్టు చేశారు. విజయవాడ శివార్లలో వ్యూహాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్‌లో దాదాపు రూ. 5.84 కోట్ల విలువైన విదేశీ బంగారం, అమెరికన్ డాలర్లు, యూరోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు.

పక్కా సమాచారంతో….
బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా విదేశీ బంగారాన్ని మన దేశంలోకి అక్రమంగా తెచ్చి, కోల్‌కతా ద్వారా హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయవాడ సమీపంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఉమ్మడి ఆపరేషన్ చేపట్టారు.
విజయవాడ శివార్లలో వెళ్తున్న ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV)ను డిఆర్ఐ అధికారులు ముందుగా అడ్డుకున్నారు. ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో రహస్యంగా ఏర్పాటు చేసిన డ్రాయర్ (సీక్రెట్ క్యావిటీ)లో భారీగా విదేశీ కరెన్సీ లభ్యమైంది. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా…. వారు విజయవాడ సమీపంలోనే కొంత బంగారాన్ని డెలివరీ చేశారని, లభ్యమైన కరెన్సీ ఆ స్మగ్లింగ్ సొమ్ముకు సంబంధించినదేనని ఒప్పుకున్నారు.
వారిచ్చిన సమాచారంతో మరో బృందం హైదరాబాద్ వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సును టోల్ ప్లాజా వద్ద అడ్డుకుంది. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితులను తనిఖీ చేయగా…. వారి నడుముకు ప్రత్యేకంగా కట్టుకున్న పౌచ్‌లలో విదేశీ మార్క్ ఉన్న మూడు బంగారు బిస్కట్లు బయటపడ్డాయి.
రూ. 5.84 కోట్ల ముఠా గుట్టు రట్టు
ఈ ఆపరేషన్‌లో మొత్తం 3,147.1 గ్రాముల (3.1 కేజీలు) విదేశీ బంగారం, 60,000 అమెరికన్ డాలర్లు, 21,500 యూరోలను అధికారులు జప్తు చేశారు. వీటి మొత్తం విలువ మార్కెట్లో రూ. 5.84 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులపై కేసులు నమోదు చేసి, న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు వారికి రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులపై డీఆర్ఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

