ఆంధ్రప్రదేశ్‌లోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(CPS) ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమస్యను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో సంతోషం నెలకొంది.

2017వ సంవత్సరం నుండి పరిష్కారానికి నోచుకోక, వివాదాస్పదంగా మారిన వెటరన్, ఫ్యామిలీ సీపీఎస్ కంట్రిబ్యూషన్ అంశంపై ఏపీ సర్కార్ పూర్తి స్పష్టతనిచ్చింది. ఉద్యోగుల గ్రాట్యుటీ అనుగుణంగానే కుటుంబాలకు 'ఫ్యామిలీ పెన్షన్' (Family Pension) మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 11,000 మంది సీపీఎస్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఒకవేళ ఉద్యోగి అకాల మరణం చెందితే, వారి కుటుంబానికి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించేలా ఈ సరికొత్త విధానాన్ని రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్రంలోనూ సామాజిక రక్షణ కల్పించాలనే డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగానే ఆఫీస్ మెమోరాండం నంబర్ 57 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. సీపీఎస్ పరిధిలోని ఉద్యోగుల రిటైర్మెంట్ లేదా మరణానంతర ప్రయోజనాలు, ఫ్యామిలీ పెన్షన్ లెక్కింపు మరింత సులభతరం కానుంది.
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఓఎం నంబర్ 57 అమలుపై ఏపీ సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిందని అసోసియేషన్ ప్రతినిధులు కొనియాడారు.
ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని, ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా ఈ సమస్యను కొలిక్కి తీసుకురావడంపై ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాత పెన్షన్ వర్సెస్ కొత్త పెన్షన్ వివాదాల మధ్య, ఈ తాజా బెనిఫిట్స్ ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారాయి.
{{/usCountry}}ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని, ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా ఈ సమస్యను కొలిక్కి తీసుకురావడంపై ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాత పెన్షన్ వర్సెస్ కొత్త పెన్షన్ వివాదాల మధ్య, ఈ తాజా బెనిఫిట్స్ ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారాయి.
{{/usCountry}}