తెలంగాణలో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్!

తెలంగాణలో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు అయింది. 30 మందితో బోర్డులో నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published on: Jun 18, 2026, 05:29:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల(పెన్షనర్లు) ఆరోగ్య భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న "ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్" ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో నంబర్ 40 (GO 40) ను విడుదల చేశారు.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత మెరుగైన, పారదర్శకమైన ఉచిత వైద్య సేవలను అందించడమే ఈ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ ట్రస్ట్‌ను సక్రమంగా నిర్వహించేందుకు గానూ మొత్తం 30 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఛైర్మన్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)

మెంబర్ సెక్రటరీ: ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) సీఈవో

మిగిలిన 28 మందిలో 17 మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు, 10 మంది వివిధ ఉద్యోగ సంఘాల నేతలు, ముగ్గురు పెన్షనర్ల సంఘాల ప్రతినిధులకు చోటు కల్పించారు. ప్రస్తుతం రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా ఉన్నవారే, ఈహెచ్‌ఎస్ (EHS) పూర్తిస్థాయి ఇన్‌ఛార్జి సీఈవోగా కూడా వ్యవహరిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బోర్డులో చోటు దక్కించుకున్న వివిధ విభాగాల ప్రతినిధులు

ఈ ప్రతిష్టాత్మక బోర్డులో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల కీలక నేతలకు ప్రాతినిధ్యం కల్పించారు. ప్రభుత్వ నిర్ణయాల అమలు, నిధుల సమీకరణే ధ్యేయంగా కీలక శాఖల అధిపతులను ఇందులో చేర్చారు.

సీఎస్, ఆర్థిక, వైద్య-ఆరోగ్య, విద్యా, హోం, సాధారణ పరిపాలన (GAD), మున్సిపల్, పంచాయతీరాజ్, ఎస్సీ అభివృద్ధి, కార్మిక, మహిళా-శిశు సంక్షేమం, న్యాయ శాఖల కార్యదర్శులతో పాటు భూపరిపాలనా చీఫ్ కమిషనర్, వైద్య విద్య డైరెక్టర్ (DME), సెర్ప్ సీఈవో, ఆరోగ్యశ్రీ సీఈవో, ఈహెచ్‌ఎస్ సీఈవోలు ఇందులో సభ్యులుగా ఉంటారు.

ఉద్యోగ సంఘాల ప్రతినిధులు

మారం జగదీశ్వర్ (అధ్యక్షుడు, టీఎన్‌జీవో)

ఏలూరి శ్రీనివాసరావు (అధ్యక్షుడు, టీజీవో)

పి.దామోదర్‌రెడ్డి (అధ్యక్షుడు, పీఆర్‌టీయూటీఎస్)

చావ రవి (అధ్యక్షుడు, టీఎస్‌యూటీఎఫ్)

గిరి శ్రీనివాస్‌రెడ్డి (అధ్యక్షుడు, తెలంగాణ సెక్రటేరియెట్ అసోసియేషన్)

జి.సదానందంగౌడ్ (అధ్యక్షుడు, ఎస్‌టీయూటీఎస్)

వి.రవీందర్‌రెడ్డి (అధ్యక్షుడు, ట్రెసా)

వి.లచ్చిరెడ్డి (అధ్యక్షుడు, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్)

దేవరకొండ సైదులు (అధ్యక్షుడు, ఎస్‌టీఎఫ్)

దాస్య నాయక్ (అధ్యక్షుడు, క్లాస్-4 ఎంప్లాయిస్ అసోసియేషన్)

పెన్షనర్ల సంఘాల నేతలు

పి.వెంకట్‌రెడ్డి (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం)

పి.కృష్ణమూర్తి (ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్)

ఆర్.ఉమాదేవి (ఛైర్‌పర్సన్, తెలంగాణ ఉమెన్ పెన్షనర్స్ అసోసియేషన్)

గత కొంతకాలంగా హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ పలు ఫిర్యాదులు ఉద్యోగుల నుండి వస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం ఈ ప్రత్యేక ట్రస్ట్‌ను తీసుకువచ్చింది. పథకం అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఆసుపత్రులకు చెల్లింపులు, నూతన మార్గదర్శకాల రూపకల్పనపై త్వరలోనే తొలి బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ట్రస్ట్ ఏర్పాటుతో ఉద్యోగులు, పెన్షనర్ల వైద్య కష్టాలు తీరతాయని భావిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More