...
...
Next Story

దుర్గమ్మ భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రిలో స్కానింగ్ పాయింట్‌లో ఉచిత లడ్డూ పంపిణీ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు కీలక సంస్కరణలు చేస్తున్నారు. లడ్డూ పంపిణీకి సంబంధించి మార్పులు చేశారు.

Updated on: Dec 31, 2025, 14:35:23 IST
Advertisement

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఆలయ అధికారులు ముఖ్యమైన విషయాన్ని తెలిపారు. అది ఏంటంటే ఇంద్రకీలాద్రిపై అమ్మవారి భక్తుల సౌకర్యార్థం ఆలయం అధికారులు కీలక సంస్కరణలను అమలు చేస్తున్నారు. దర్శనం, ప్రసాద పంపిణీ వ్యవస్థలో సమయం ఆదా, పారదర్శకత, దుర్వినియోగాన్ని నియంత్రించడాన్ని లక్ష్యంగా మార్పులు తీసుకొస్తున్నారు. ఇక మీద రూ.500 అంతరాలయ దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు ఉచిత లడ్డూను దర్శనానికి ముందు, టికెట్ స్కానింగ్ పాయింట్ దగ్గర పంపిణీ చేస్తారు. టికెట్ స్కాన్ అయిన వెంటనే భక్తులకు లడ్డూ చేతికి అందచేసే విధానాన్ని ఆలయ బోర్డు అమల్లోకి తెచ్చింది.

విజయవాడ దుర్మమ్మ గుడి
విజయవాడ దుర్మమ్మ గుడి

భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, పారదర్శకతను నిర్ధారించడానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ యాజమాన్యం ప్రసాద పంపిణీ కోసం ఈ కొత్త వ్యవస్థను ప్రకటించింది. రూ.500 అంతరాలయ దర్శన టికెట్ కొనుగోలు చేసే భక్తులు ఇప్పుడు టికెట్ స్కానింగ్ పాయింట్‌లోనే వారి ఉచిత లడ్డూ ప్రసాదాన్ని పొందుతారని తెలిపింది.

లడ్డూ పంపిణీని నేరుగా టికెట్ స్కానింగ్‌తో అనుసంధానించడం ద్వారా 'టిక్కెట్ల దుర్వినియోగాన్ని తనిఖీ చేయవచ్చు. ఆలయ ఆదాయాల లెక్కింపులో కచ్చితత్వాన్ని నిర్ధారించవచ్చు.' అని ఆలయ అధికారులు అన్నారు. స్కాన్ చేసిన టిక్కెట్లు ఆటోమేటిక్‌గా భక్తులకు లడ్డూలు అందేలా చేస్తాయి. ఈ ప్రక్రియ జవాబుదారీగా చేస్తాయి.

ఇప్పటివరకు భక్తులు దర్శనం తర్వాత ప్రసాదం తీసుకోవడానికి ప్రత్యేక కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేది. తరచుగా రద్దీని, వేయిట్ చేసే సమయాన్ని పెంచుతుంది. ఎంట్రీ స్కానింగ్ పాయింట్ వద్ద లడ్డూ పంపిణీ జరగడంతో భక్తులు విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

ఈ కొత్త వ్యవస్థ భక్తులు ప్రసాదాన్ని కోల్పోకుండా చేస్తుంది. కచ్చితత్వాన్ని కాపాడుకోవడానికి కఠినమైన పర్యవేక్షణ ఉంటుంది. దాదాపు అందరు భక్తులు ఈ విధానాన్ని స్వాగతిస్తున్నారు. ఈ కొత్త విధానం లైన్లలో వేచి ఉండాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ మార్పులు.. భక్తులకు సులభమైన, వేగవంతమైన దర్శనం, ప్రసాదం అందజేసేందుకు ఉపయోగపడుతుంది. పూర్తి పారదర్శకత ఉంటుందని ఆలయ అధికారులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe