ఏపీ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు 2026 రూపకల్పనకు ఏపీ ప్రభుత్వం వేగవంతమైన చర్యలు
పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, 2026ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవాదుల భద్రత, రక్షణ, వారి సంక్షేమాన్ని పటిష్టం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు - 2026 ముసాయిదా తయారీ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదాను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని మంత్రి ఎన్. మహమ్మద్ ఫరూక్ అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు ఓ ప్రకటనలో మంత్రి ఫరూక్ వివరాలను వెల్లడించారు. న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవికి సంబంధిత శాఖలతో చర్చలు జరిపి, ఈ బిల్లు ముసాయిదాను ప్రాధాన్యతా ప్రాతిపదికన సిద్ధం చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల హక్కులను కాపాడటానికి, వారి రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న అడ్వకేట్లకు తగిన భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ముసాయిదా బిల్లు రూపకల్పన పూర్తయిన తర్వాత పాటించే విధివిధానాలను మంత్రి వివరించారు. సిద్ధమైన ముసాయిదాను ముందుగా అడ్వకేట్ జనరల్, ఆర్థిక శాఖల పరిశీలనకు పంపుతారు. వారి సలహాలు, సిఫార్సుల అనంతరం తుది ముసాయిదాను రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కోసం సమర్పిస్తారు. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎటువంటి ఆలస్యం లేకుండా శాసన ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా ముసాయిదాను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
న్యాయవాదుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న అంకితభావాన్ని ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా ఇప్పటివరకు మరణించిన 1,173 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ. 46.92 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక ఉపశమనం కల్పించామని ఆయన చెప్పారు. ప్రతిపాదిత అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా న్యాయవాదులకు సంస్థాగత రక్షణ లభించడమే కాకుండా, వారి భద్రత, సంక్షేమానికి సంబంధించిన చర్యలు మరింత బలోపేతం అవుతాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


