Half Day Schools : ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి నుంచి హాఫ్ డే స్కూళ్లు.. టైమింగ్స్ ఇవే
Half Day Schools 2026 : తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హాఫ్ డే స్కూళ్ల టైమింగ్ ఎలా ఉందో చెక్ చేయండి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపం పెరుగుతున్న క్రమంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఒంటి పూట బడులను నడుపుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పెరిగిన ఎండల కారణంగా హాఫ్ డే స్కూళ్లు ప్రారంభం అయ్యాయి.

అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 16 నుండి హాఫ్-డే పాఠశాల సమయాలు అమలు చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం ఏప్రిల్ 23న ముగియనుంది. రెండు రాష్ట్రాలలోని పాఠశాలలకు చివరి పని దినం కావడంతో ఒండిపూట బడులు ప్రారంభం అయ్యాయి.
తెలంగాణలో హాఫ్ డే టైమింగ్స్
తెలంగాణలో పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పనిచేస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, విద్యార్థులను ఇంటికి పంపే ముందు మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలు ఈ సమయాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎటువంటి మినహాయింపులు ఇవ్వరని, మధ్యాహ్నం సెషన్ తర్వాత పాఠశాలలు మూసివేయాలని అధికారులు స్పష్టం చేశారు.
2026-27 విద్యా సంవత్సరానికి వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి ప్రారంభమవుతాయని, జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యా శాఖ ప్రకటించింది.
ఏపీలో హాఫ్ డే టైమింగ్స్
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 23 వరకు పాఠశాలలు ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నడుస్తాయి. పాఠశాల విద్యా శాఖ మధ్యాహ్నం భోజన కార్యక్రమం కొనసాగుతుందని ఆదేశించింది. వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి ప్రారంభమవుతాయి, జూన్ 12 నుండి విద్యా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.
పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహార విషయంలో ఎలాంటి అంతరాయం కలగకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. జాగ్రత్తలు తీసుకున్నది. ఉదయం పాఠశాల ప్రారంభ సమయంలో రాగిజావ, మధ్యాహ్నం తరగతులు.. ముగిసిన తర్వాత మిడ్ డే మిల్స్ విద్యార్థులకు అందిస్తారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


